దగ్గుబాటిని దూరం పెట్టేశారు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దగ్గుబాటిని దూరం పెట్టేశారు

ఒంగోలు, నవంబర్ 7, (way2newstv.com)
పర్చూరు రాజకీయానికి జగన్ తెరదించేసినట్లేనంటున్నారు. పూర్తిస్థాయిలో రావి రామనాధంబాబుకు పర్చూరు శాసనసభ నియోజకవర్గ ఇన్ ఛార్జి పదవిని ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు తెలిసింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావును పూర్తిగా పక్కన పెట్టాలని జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రకాశం జిల్లా మంత్రులతో పాటు సీనియర్ నేతలకు జగన్ ఈ విషయం చెప్పినట్లు సమాచారం తర్వలోనే రావి రామనాధం బాబును ఇన్ ఛార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడనున్నాయని సమాచారం.దగ్గుబాటి వెంకటేశ్వరరావు పట్ల తొలుత జగన్ కొంత సానుకూలతతోనే ఉన్నారు. అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన రాజకీయ అనుభవాన్ని మార్చి స్టయిల్ మార్చారు. తాను, తన కుటుంబం వైసీపీ నుంచి తప్పుకున్నా, తన క్యాడర్ ఇబ్బంది పడకూడదని దగ్గుబాటి వెంకటేశ్వరరావు భావించారు. 
దగ్గుబాటిని దూరం పెట్టేశారు

అందుకే తనకు అనుకూలంగా ఉన్న గొట్టిపాటి భరత్ ను కాని, దగ్గుబాటి హితేష్ ను కాని పర్చూరు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా నియమించాలని అనుచరుల చేత వత్తిడి తెచ్చారు.గొట్టిపాటి భరత్ 2014 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత గొట్టిపాటి భరత్ తాను పర్చూరు నియోజకవర్గం బాధ్యతలను చూసుకోలేనని తేల్చి చెప్పి పక్కకు తప్పుకున్నారు. 2016 నుంచి రావి రామనాధం పర్చూరు నియోజకవర్గ ఇన్ ఛార్జి బాధ్యతలను చూశారు. పార్టీ కష్ట సమయాల్లో గొట్టి పాటి భరత్ కాడి వదిలేశారని జగన్ భావించారు. జగన్ పాదయాత్ర ప్రకాశం జిల్లాలో జరుగుతున్నప్పుడు కూడా గొట్టి పాటి భరత్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు.అయితే గొట్టిపాటి భరత్ ను ఇన్ ఛార్జిగా నియమించాలన్న డిమాండ్ వెనక దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉన్నారని గుర్తించిన వైసీపీ సీనియర్ నేతలు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇక దగ్గుబాటి కుటుంబాన్ని పార్టీలో కొనసాగించడం వృధా అని భావించిన జగన్ రావిరామనాధం కు బాధ్యతలను అప్పగించాలని సీనియర్ నేతలు బాలినేని శ్రీనివాసులురెడ్డి, వైవీసుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలకు సూచించినట్లు తెలిసింది. త్వరలోనే ఈ నియామకపు ఉత్తర్వులు వెలువడనున్నాయని తెలిసింది.