వేగంగా ఆర్ఆర్ ఆర్ షూటింగ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వేగంగా ఆర్ఆర్ ఆర్ షూటింగ్

హైద్రాబాద్, నవంబర్ 12 (way2newstv.com)
తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమాల్లో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘RRR’ ఒకటి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరిపై ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రాజమౌళి క్షణం తీరిక లేకుండా రాత్రింబవళ్లు షూటింగ్ చేస్తున్నారని చిత్ర యూనిట్‌కు చెందిన కొంత మంది ద్వారా తెలిసింది.
వేగంగా ఆర్ఆర్ ఆర్ షూటింగ్

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. షూటింగ్ కోసం అక్కడ ప్రత్యేకంగా సెట్ కూడా వేశారు. పగటి పూట రామ్ చరణ్‌తో షూటింగ్ చేస్తున్న జక్కన్న.. రాత్రిళ్లు జూనియర్ ఎన్టీఆర్‌పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. అయితే, ఈ షెడ్యూల్ తరవాత ఎన్టీఆర్‌కు కొన్ని రోజులు విశ్రాంతి ఇస్తారట. ఈ సమయంలో కోకాపేట్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో రామ్ చరణ్‌తో ఒక షెడ్యూల్ చేయనున్నారని సమాచారం. ఈ షూటింగ్ పగటి పూటే ఉంటుందని తెలిసింది.భారీ బడ్జెట్‌తో బహుబాషా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను రాజమౌళి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జాతీయ స్థాయిలో అందరినీ ఆకర్షించడానికి బాలీవుడ్ స్టార్స్‌ను ఈ ప్రాజెక్టులోకి తీసుకొచ్చారు. అలియా భట్, అజయ్ దేవగణ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే, తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ భారీ చిత్రం వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది