టీడీపీలో మహిళ సీనియర్లకు దారేది - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

టీడీపీలో మహిళ సీనియర్లకు దారేది

విజయవాడ, నవంబర్ 22 (way2newstv.com)
రాష్ట్రంలో అధికారం కోల్పోయిన టీడీపీలో మ‌హిళా నేత‌ల‌కు వింత క‌ష్టాలు ప్రారంభ‌మ‌య్యాయి. గ‌డిచిన ఐదేళ్లలో త‌మ‌కు తిరుగు లేద‌ని అనుకున్న మ‌హిళా నాయ‌కుల్లో చాలా మందికి ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో చంద్రబాబు టికెట్లు కేటాయించ‌లేదు. అయితే, ఎన్నిక‌లకు ముందు వీరంతా ఎమ్మెల్యేలుగా, విప్‌లుగా, మంత్రులుగా కూడా చ‌క్రం తిప్పారు. అయితే, వివిధ కార‌ణాల‌తో మ‌హిళా నేత‌ల్లో చాలా మంది పాత‌వారిని ప‌క్కన పెట్టిన చంద్రబాబు కొత్తవారిని భుజాల‌పై మోశారు. కానీ, కొత్తవారిలో కేవ‌లం ఒక్కరు మాత్రమే విజ‌యం సాధించారు. మిగిలిన కొత్త / పాత వారంతా ఓడిపోయారు. రాజ‌మండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి భ‌వానీ ఒక్కరే గెలుపు గుర్రం ఎక్కారు.
టీడీపీలో మహిళ సీనియర్లకు దారేది

మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో కొత్త మ‌హిళా నాయ‌కులుగెలుపు గుర్రం ఎక్కలేక పోయారు. దీంతో ఇప్పుడు మ‌ళ్లీ పాత వారే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పుంజుకోవాల‌ని భావిస్తున్నారు. కానీ, ఇప్పటి వ‌ర‌కు చంద్రబాబు నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ ల‌భించ‌క పోగా.. క‌నీసం పాత‌వారి విష‌యంపై చంద్రబాబు ఇప్పటి వ‌ర‌కు దృష్టి పెట్టలేదు. ఇలాంటి వారిలో ప్రముఖంగా క‌నిపిస్తున్నవారు.. మాజీ మంత్రి పీత‌ల సుజాత‌(చింత‌ల‌పూడి), మాజీ విప్ యామినీ బాల‌(శింగ‌న‌మ‌ల‌), మాజీ ఎమ్మెల్యేలు.. డీఏ స‌త్యప్రభ‌(చిత్తూరు), సుగుణ‌మ్మ(తిరుప‌తి), పిల్లి అనంత‌ల‌క్ష్మి(కాకినాడ రూర‌ల్‌), గుండ ల‌క్ష్మీదేవి(శ్రీకాకుళం) వంటివారు ప్రముఖంగా ఉన్నారు. వీరిలో ఒక్క సుగుణ‌మ్మ, అనంత‌ల‌క్ష్మి, ల‌క్ష్మీదేవిల‌కు మాత్రమే ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో చంద్రబాబు టికెట్ ఇచ్చారు. మిగిలిన వారికి టికెట్ ఇవ్వలేదుఅయితే, వీరంతా ఓట‌మి చ‌విచూశారు. దీంతోఇప్పుడు చంద్రబాబు ఏమైనా త‌మ‌కు అండ‌గా నిలుస్తారా ? అని వెయ్యిక‌ళ్లతో వీరంతా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా గ‌తంలో మంత్రి ప‌ద‌విని ఆశించిన యామినీ బాల‌ను ఏకంగా చంద్రబాబు ప‌క్కన పెట్టారు. అయిన‌ప్పటికీ.. ఆమె పార్టీలో తిరుగుతున్నారు. అదేవిధంగా మాజీ మంత్రి పీత‌ల సుజాత‌ను సైతం చంద్రబాబు పూర్తిగా ప‌క్కన పెట్టారు. అయినా కూడా ఆమె కూడా పార్టీని బ‌లోపేతం చేసేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. కానీ, ఇప్పటి వ‌ర‌కు చంద్రబాబు నుంచి వీరికి ఎలాంటి హామీలు ల‌భించ‌లేదు. నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జులుగా నియమిస్తారేమోన‌ని వీరుఎదురు చూస్తున్నారు.ఇదిలావుంటే, సుగుణ‌మ్మ, పిల్లి అనంత‌ల‌క్ష్మి స్థానాల్లో కొత్తవారి కోసం స్థానికంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అదే స‌మ‌యంలో చిత్తూరులోనూ స‌త్యప్రభ యాక్టివ్‌గా లేరు. ఆమెను చంద్రబాబు చివ‌ర్లో బ‌ల‌వంతంగా రాజంపేట లోక్‌స‌భ‌కు పంపించి ఓడేలా చేశార‌ని చంద్రబాబుపై ఫైర్ అవుతున్నార‌ను. దీంతో ఆమె రాజ‌కీయాలు వదులుకుని త‌న కుటుంబ వ్యాపారాల్లోనే మునిగి తేలుతున్నారు. దీంతో ఆమెను మార్చాల‌ని డిమాండ్లు వ‌స్తున్నాయి. అదే స‌మ‌యంలో గుండ ల‌క్ష్మీదేవి ఎన్నిక‌ల స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలో తిరిగినా.. ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. దీంతో ఆమెను కూడా మార్చాల‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ఇక టిక్కెట్లు రాని యామినిబాల‌, పీత‌ల సుజాత లాంటి వాళ్లు మ‌ళ్లీ మాకు చంద్రబాబు అవకాశం ఇవ్వకపోతారా? అని ఎదురు చూస్తున్నారు. ఇక శింగ‌న‌మ‌లలో గ‌త ఎన్నికల్లో ఓడిన బండారు శ్రావ‌ణి దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నారు. ఆమెకు సీటు ఇప్పించిన జేసీల‌కే గ‌తి లేదు. ఇక ప‌లాస‌లో ఓడిపోయిన గౌతు శిరీష‌, పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా ఉండ‌డంతో ఆమె మాత్రం పార్టీలో యాక్టివ్‌గా ఉన్నారు. ఇక రాజ‌మ‌హేంద్రవ‌రం ఎంపీగా ఓడిన ముర‌ళీమోహ‌న్ కోడ‌లు మాగంటి రూపాదేవి మాత్రం రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇక కృష్ణా జిల్లాలో ఓడిన మాజీ ఎమ్మెల్యేల్లో ఉప్పులేటి క‌ల్పన పామ‌ర్రులో పార్టీని గాలికి వ‌దిలేశారు. తంగిరాల సౌమ్య మాత్రం నందిగామ‌లో ఉమాతో క‌లిసి అప్పుడ‌ప్పుడు క‌నిపిస్తున్నారు. మ‌రి ఈ మ‌హిళా నేత‌ల ఫ్యూచ‌ర్ ఏంటో ఫ్యూచ‌రే చెప్పాలి.