ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
గద్వాల నవంబర్ 04 (way2newstv.com)
సోమవారం గట్టు మండలం కేంద్రంలోని మండలం పరిషత్ కార్యాలయంలో జరిగిన కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. 27 మందికి లబ్ధిదారులకు కళ్యాణ చెక్కులను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత గౌరవం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి ఆడపడుచులకు అండగా ఉండటానికి కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టరని అన్నారు.
ఆడపడుచులకు అండగా తెరాస ప్రభుత్వం
ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో లో గౌరవ కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగినది . గతంలో ఎన్నో ప్రభుత్వాలు పరిపాలించడం జరిగినది ఇలాంటి గొప్ప ఆలోచన ఎవరూ చేయలేక పోయారని అన్నారు. కేసిఆర్ ఆడపిల్లలకు పెళ్లి కానుక గా పథకం ప్రవేశ పెట్టినప్పుడు 50000 వేలు రూపాయలు మొదలు చేసి ప్రస్తుతం లక్ష 116 రూపాయలు ప్రభుత్వం తరఫున పెళ్లికి ఖర్చుగా కానుకగా అందజేయడం జరుగుతుంది. అలాగే పట్టాదారు రైతులకు పట్టా పాస్ పుస్తకం పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మె్యలే అన్నారు. ఈ కార్యక్రమం లో మండల ఎంపీపీ విజయ్, జడ్పిటిసి సభ్యులు బాసు శ్యామల, వైస్ యం పి పి సుమతీ , జడ్పీ కోఆప్షన్ నెంబర్, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు