తెలంగాణలో కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలంగాణలో కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి

హైద్రాబాద్, నవంబర్ 7, (way2newstv.com)
ఈ ఏడాది ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతున్న నేపథ్యంలో ధాన్యం విక్రయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ పకడ్బంది చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గత ఏడాది రూపొందించిన పాలసీలో అనేక మార్పులు చేర్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా ధాన్యం విక్రయంలో రైతులకు అవగాహన కల్పిస్తూ క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో మరింత పకడ్బందిగా వ్యవహరించేలా వ్యవసాయ శాఖను భాగస్వామ్యం చేసింది. క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు కీలక బాధ్యతలను అప్పగించింది. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఎఇఒనుఇన్‌ఛార్జిగా నియమించింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ధాన్యం రాకుండా పోలీసు ఆధ్వర్యంలో జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తోంది. 
తెలంగాణలో కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి

ప్రస్తుత ఖరీఫ్‌లో 60 లక్షల మెట్రిక్ టన్నులు, రబీలో 40 లక్షల మెట్రిక్ టన్నులు కలిపి దాదాపు కోటి మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌరసరఫరాల సంస్థ ప్రాథమికంగా నిర్ణయించింది. గత ఏడాది ఖరీఫ్‌లో 40 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా ఈసారి దాదాపు 20లక్షల మెట్రిక్ టన్నుల ధా న్యం అధికంగా వస్తుందనే అంచనాతో అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. ధాన్యం దిగుబడిని దృష్టిలో పెట్టుకొని కొనుగోళ్లను ప్రారంభిస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 304 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది.తొలిసారిగా పౌరసరఫరాల శాఖ కమిషనర్ చైర్మన్‌గా రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణకు 16 కోట్ల గోనె సంచులు అవసరమవుతాయి. ధాన్యం దిగుబడులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ప్రకారం 54:46 నిష్పత్తితో ప్రాధాన్యత క్రమంలో జిల్లాల వారీగా, కేంద్రాల వారీగా గోనె సంచులను కేటాయించడం జరుగుతుంది. రైతు సమస్యలు, కనీస మద్దతు ధర తదితర విషయాల్లో ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూంతో పాటు టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీల్లో లీడ్ బ్యాంక్ మేనేజర్, లేబర్ కార్మిక, పోలీసు విభాగాలను భాగస్వామ్యం చేసింది. సిఎం కె.చంద్రశేఖరరావు చేపట్టిన రైతు సంక్షే మ చర్యలు, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, 24 గం టల కరెంటు, రైతు బంధు వంటి పథకాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింది. దీంతో ఈ ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి కానుంది.స్థానిక అవసరాలను బట్టి రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఐకెపి, పిఎసిఎస్, డిసిఎంఎస్ ఆధ్వర్యంలో 3327 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోం ది. అవసరమైతే అప్పటికప్పుడు కేంద్రాలను ఏర్పాటు చేసేలా ప్రణాళికలను కూడా సిద్దం చేస్తోంది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చిన రైతులు వాటిని విక్రయించేందుకు వేచి ఉండాల్సిన పరిస్థితి రాకుండా తగిన చర్యలు తీసుకుంటోంది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది 2014-15లో పౌరసరఫరాల సంస్థ 24.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, 201819లో రికార్డు స్థాయిలో 77.41 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. 53 లక్షల మెట్రిక్ టన్నులు అధికం. అంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో కొనుగోళ్లు 318 శాతం పెరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవానికి ముందు 201314 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 24.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది.ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం కేవలం ఐదు సంవత్సరాలలోనే దక్షిణ భారతదేశంలో అగ్రస్థానానికి చేరుకోగా, దేశంలో రెండో స్థానానికి చేరుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం అంటేనే భయపడే పరిస్థితికి వచ్చిన రైతులు తెలంగాణలో సిఎం కెసిఆర్ చర్యల వల్ల వ్యవసాయంపై మక్కువ చూపుతున్నారు. గడిచిన రెండు మూడేళ్లలో రాష్ట్రంలో ధాన్యం దిగుబడులు రికార్డు స్థాయిలో పెరగడమే ఇందుకు నిదర్శనం. కాగా కొనుగోలు కేంద్రాల్లో తేమకొలిచే యంత్రాలు, టార్పాలిన్‌లు, ప్యాడి క్లీనర్స్, విన్నోవింగ్ మిషన్లు, మాయిశ్చర్ మీటర్లు, తాగునీరు వంటి కనీస వసతులు కల్పించే విషయంలో మరింత పకడ్బందీగా వ్యవహరిస్తోంది.గత ఏడాది కంటే ఈ ఏడాది కనీస మద్దతు ధర సాధారణ రకం క్వింటాలు రూ. 1750 నుండి రూ. 1815కి, గ్రేడ్ ’ఏ’ రకం క్వింటాల్‌కు రూ. 1770 నుండి రూ. 1835కు పెరిగింది. ధాన్యం విక్రయించే రైతులకు కనీస మద్ధతు ధరను తప్పనిసరిగా చెల్లించాలి. కొనుగోలులో దళారుల ప్రమేయం లేకుండా చూడాలి. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ధాన్యం రవాణా, పర్యవేక్షణ, కనీస మద్దతు ధర, వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం రాష్ట్ర స్థాయిలో మొదటిసారిగా పౌరసరఫరాల శాఖ కమిషనర్ చైర్మన్‌గా రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో వ్యవసాయ శాఖ కమిషనర్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్, పోలీస్‌శాఖ నుంచి ఒకరు, సిడబ్లూసి రీజినల్ మేనేజర్, ఎస్‌డబ్ల్యూసి మేనేజింగ్ డైరెక్టర్, సెర్ప్ సిఇఒ, కోఆపరేషన్ కమిషనర్, ఎఫ్‌సిఐ జనరల్ మేనేజర్ సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్‌ల ఆధ్వర్యంలో ధాన్య సేకరణ కమిటీలను ఏర్పాటు చేసింది.రాష్ట్రస్థాయిలో, జిల్లాస్థాయిలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసింది. ధాన్యానికి కనీస మద్దతు ధర, ఇతర ఫిర్యాదుల కోసం హైదరాబాద్‌లోని పౌరసరఫరాల భవన్‌లోని టోల్‌ఫ్రీ నెంబర్ 180042500333, 1967 ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పౌరసరఫరాల శాఖ కన్సల్టెంట్ ఆధ్వర్యంలో పౌరసరఫరాల శాఖ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్‌లు, పౌరసరఫరాల సంస్థ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) సభ్యులుగా హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో సెంట్రల్ మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేసింది.