హస్తిన వచ్చారు...వెళ్లారు.. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

హస్తిన వచ్చారు...వెళ్లారు..

న్యూఢిల్లీ, నవంబర్ 22 (way2newstv.com)
నసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలుస్తారని పెద్దయెత్తున ప్రచారం జరిగింది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటంతో పవన్ కల్యాణ‌్ వెళ్లి బీజేపీ నేతలను కలసి రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేసి వస్తారనుకున్నారు. కానీ ఢిల్లీలో పవన్ కల్యాణ‌్ ఢిల్లీ పర్యటన ఆయనకు చేదు అనుభవం మిగిలించిందంటున్నారు. నిజానికి పవన్ కల్యాణ్ వ్యక్తిగత పర్యటన పై వెళుతున్నారని జనసేన వర్గాలు చెప్పినా, ఆయన లాంగ్ మార్చ్ లో చేసిన వ్యాఖ్యలు బీజేపీ నేతలు కలవాలనే వెళ్లారనేది స్పష్టం చేస్తుంది.నిజానికి పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి బీజేపీ నేతలను కలిసే ప్రయత్నం చేయలేదు. జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఒకసారి మోదీని మాత్రం కలసి వచ్చారు. తర్వాత 2014 ఎన్నికల సమయానికి ముందు నరేంద్ర మోదీతో కలసి ఏపీలో జరిగిన వివిధ సభల్లో పాల్గొన్నారు. 
హస్తిన వచ్చారు...వెళ్లారు..

మోదీ కూడా పవన్ కల్యాణ్ ఆలోచనలను మెచ్చుకున్న సందర్భాలున్నాయి. ఎన్నికల తర్వాత మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పినప్పుడు పవన్ కల్యాణ్ మోదీకి వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు. బీజేపీని తరిమికొట్టమని పిలుపునిచ్చారు.2019 ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసిన పవన్ కల్యాణ్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు స్టార్ట్ చేశారు. ఎన్నికల ఫలితాలు ఆయనను నిశ్చేష‌్డుడిని చేశాయి. నిజానికి జగన్ గెలుస్తారని పవన్ కల్యాణ్ ఊహించలేదు. తెలుగుదేశం పార్టీకి కొంత మెజారిటీ వచ్చినా తనకు వచ్చే సీట్లతో మద్దతిచ్చి సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేస్తామన్న ధీమాతో ఉన్నారు. తాను కింగ్ మేకర్ కావచ్చనుకున్నారు. కానీ 151 సీట్లు వైసీపీకి రావడంతో జగన్ నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ పవన్ కల్యాణ్ పోరాటాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఇసుక కొరతపై లాంగ్ మార్చ్ నిర్వహించారు.లాంగ్ మార్చ్ కు ముందే వైసీపీ, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం మొదలయింది. పవన్ పై వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగారు. దీంతో పవన్ కల్యాణ్ తాను ఢిల్లీ వెళ్లి తేల్చుకుంటానని చెప్పి శపథం చేశారు. కానీ పవన్ కల్యాణ‌్ ఢిల్లీలో దాదాపు నాలుగు రోజులున్నా ఎవరి అపాయింట్ మెంట్ దొరకలేదు. మహారాష్ట్ర రాజకీయాల్లో అమిత్ షా బిజీ గా ఉండటంతో ఆయన అపాయింట్ మెంట్ కూడా పవన్ కల్యాణ‌్ కు లభించలేదని చెబుతున్నారు. ఇక అమిత్ షా ను కలసిన తర్వాతనే మోడీని కలవాల్సి ఉంది. మోడీ అపాయింట్ మెంట్ కోసం అసలు ప్రయత్నించనే లేదని తెలుస్తోంది. బీజేపీ నేతల నుంచి సరైన స్పందన లభించలేదని చెబుతున్నారు. మొత్తం మీద పవన్ కల్యాణ‌్ ఢిల్లీ పర్యటన ఎటువంటి హడావిడి లేకుండా ముగిసింది.