లోకేష్ ఒంటరవుతున్నాడా... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

లోకేష్ ఒంటరవుతున్నాడా...

విజయవాడ, నవంబర్ 22, (way2newstv.com)
తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లిపోయేవారందరికీ ఇప్పుడు నారా లోకేష్ ఒక కారణంగా దొరికారు. చంద్రబాబు నాయుడు అనంతరం నారా లోకేష్ పార్టీని సమర్థవంతంగా నడపలేరన్నది అందరి భావన. ప్రసంగాలు, వ్యూహాలు, ఇమేజ్, క్రేజ్ లేని నాయకుడిగా నారా లోకేష్ ను ప్రతి ఒక్కరూ అనేసి జెండాను పక్కన పడేస్తున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒకింత ముందడుగు వేసి జూనియర్ ఎన్టీఆర్ తో నారా లోకేష్ ను పోల్చి చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ ను నారా లోకేష్ కోసమే బయటకు పంపారని వ్యాఖ్యానించారు కూడా.నారా లోకేష్ ను కార్నర్ చేస్తున్నా ఏ ఒక్కరూ దీనిపై మాట్లాడకపోవడం చర్చనీయాంశమైంది. నారా లోకేష్ కు తెలుగుదేశం పార్టీలో బలమైన నేతలు అండగా ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నేతలందరూ నారా లోకేష్ చుట్టూ తిరిగిన వారే. 
లోకేష్ ఒంటరవుతున్నాడా...

అయితే నారా లోకేష్ నాయకత్వ లక్షణాలపై ఇంత పెద్ద యెత్తున విమర్శలు విన్పిస్తున్నప్పటికీ ఏ ఒక్కరూ పెదవి విప్పకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కనీసం లోకేష్ సామాజికవర్గానికి చెందిన నేతలు కూడా నారా లోకేష్ పై విమర్శలకు కౌంటర్ ఇవ్వడం లేదు.ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో వల్లభనేని వంశీ చేసిన విమర్శలకు ఏ ఒక్కరూ కౌంటర్ ఇవ్వలేదు. 23 మంది ఎమ్మెల్యేల్లో 11 మంది కమ్మ సామాజికవర్గం వారే. కానీ ఎమ్మెల్యేలు కాని వర్ల రామయ్య, దేవినేని ఉమ వంటి వాళ్లే కౌంటర్లు ఇచ్చారు. అంతే తప్ప మిగిలిన నేతలు నారా లోకేష్ పై వస్తున్న విమర్శలకు పెద్దగా స్పందించడం లేదు. అంటే నారా లోకేష్ నాయకత్వంపై ఎక్కువ మంది వంశీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లుగా అర్థమవుతోంది.నారా లోకేష్ మూడున్నరేళ్ల క్రితమే ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి వచ్చారు. అంతకు ముందు ఐదేళ్ల నుంచి పార్టీ కోసం ఆయన బ్యాక్ టీంగా పనిచేస్తున్నారు. నారా లోకేష్ పూర్తి స్థాయి రాజకీయనేతగా అవతరించిన తర్వాతనే ఆయన అసలు విషయం బయటపడిందంటున్నారు. మంత్రిగా, పార్టీ జాతీయ కార్యదర్శిగా నారాలోకేష్ ఫెయిల్ అయ్యారనే వారూ ఎక్కువగానే ఉన్నారు. అంతేకాకుండా మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోవడం కూడా నారా లోకేష్ దక్షతకు మైనస్ గా చెప్పుకుంటున్నారు. మొత్తం మీద నారా లోకేష్ నాయకత్వంపై మెజారిటీ నేతలు అనుమానంగానే ఉన్నట్లు అర్థమవుతోంది