విజయవాడ, నవంబర్ 15, (way2newstv.com)
తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. ‘టీడీపీ నుంచి చంద్రబాబు నన్ను సస్పెండ్ చేయడమేంటి?. నేను ముందే పార్టీకి రాజీనామా చేశా. నేను ప్రజల్లో ఉన్న మనిషిని. ప్రజలు ఎటువైపు అనుకూలంగా ఉన్నారో నాకు తెలియదా?. ప్రజలకు ఉపయోగపడే పథకాలు వచ్చినప్పుడు అందరూ స్వాగతించాల్సిందే. ’ అని ఆయన అన్నారు. కాగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన ఎమ్మెల్యే వంశీని టీడీపీ శుక్రవారం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
నేనే రిజైన్ చేశా... నన్ను సస్పెండ్ ఏంటీ
అయితే సస్పెన్షన్ కంటే ముందే ఆయన టీడీపీకి రాజీనామా చేశారు.’నాపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్న టీడీపీ నేతల బతుకు ఏంటో అందరికీ తెలుసు. నా దిష్టిబొమ్మను దగ్ధం చేసిన మాత్రానా నా ఇమేజ్ ఏమీ తగ్గదు. ఎన్నికల సమయాల్లో సూట్‌కేసులు కొట్టేసేవాళ్లు నా పై ఆరోపణలు చేయడం హాస్యాస్పదం. నేను ఏమి అనుకున్నానో అది మనస్పూర్తిగా చేస్తాను. నన్ను ఎవరూ ప్రభావితం చేయలేదు. మనసాక్షిగానే వ్యవహరిస్తున్నాను. ప్రభుత్వం మంచి పనులు చేస్తే పార్టీలకు అతీతంగా మద్దతు చెప్పాం. ఇక మా నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశాను. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.