రజనీకాంత్ కి గోల్డెన్ జూబ్లీ అవార్డు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రజనీకాంత్ కి గోల్డెన్ జూబ్లీ అవార్డు

న్యూఢిల్లీ నవంబర్ 02,(way2newstv.com):
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) ఉత్సవాలు ప్రతి ఏడాది గోవాలో ఘనంగా జరగనున్న సంగతి తెలిసిందే.  ఈ వేడుకలో పలు చిత్రాల ప్రదర్శనతో పాటు కొందరు ప్రముఖులని అవార్డులతో సత్కరించనున్నారు.  ఈ ఏడాది నవంబర్ 20 నుండి 28వరకు 50వ ఇఫి వేడుకలు గోవాలో ఘనంగా జరగనున్నాయి. ఇందులో 250కి పైగా సినిమాలు ప్రదర్శన జరుపుకోనున్నాయి..  
రజనీకాంత్ కి గోల్డెన్ జూబ్లీ అవార్డు

ఈ వేడుకలో సూపర్ స్టార్ రజనీకాంత్ని గోల్డెన్ జూబ్లీ అవార్డ్తో సత్కరించనున్నారు.  ఈ విషయాన్ని బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ప్రకాశ్ జవదేకర్ శనివారం ప్రకటించారు.  తనకి ఈ ప్రతిష్టాత్మక గౌరవం అందించినందుకు రజనీకాంత్ భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిజేశారు.  కాగా, లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫ్రెంచ్ యాక్టర్ ఇసాబెల్లె హప్పర్ట్కి అందిస్తున్నట్టు పేర్కొన్నారు.