విజయవాడ నవంబర్ 7 (way2newstv.com)
గురువారం మధ్యాహ్నం విజయవాడ సిటీ కమిషనర్ ద్వారకా తిరుమల రావును మాజీమంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడులు కలిసారు.
సీపీకి కలిసిన టీడీపీ నేతలు
ఈ నెల14వ తేదీన భవన నిర్మాణ కార్మికులకు అండగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇసుక కొరత మీద మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విజయవాడలో తలపెట్టిన నిరాహార దీక్షకు అనుమతి కోరారు. దానికోసం ఒక వినతి పత్రం అందజేశారు.