వనపర్తి నవంబర్ 19 (way2newstv.com)
వనపర్తి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా , పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ 102 వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రివర్యులు ఏఐసీసీ కార్యదర్శి,మాజీ మంత్రి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి హాజరయ్యారు. చిన్నారెడ్డి ఇందిరాపార్క్ దగ్గర అలాగే 4 వ వార్డు లో ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి
ఈసందర్బంగా మాజీ మంత్రి చిన్నారెడ్డి మాట్లాడుతూ భారతదేశ కీర్తిని జాతిని ప్రపంచానికి పరిచయం చేసిన అమర మేధావి నాయకురాలు పేదల భారతదేశ ఆడపడుచు మాజీ ప్రధాని విప్లవాత్మకమైన సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించి రోటి కపడ మకాన్ అందించి, పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రజా నాయకురాలు దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన మహోన్నత నాయకురాలు ఇందిరా గాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తైలం శంకర్ ప్రసాద్, పీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ , జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య , పట్టణ అధ్యక్షులు డి కిరణ్ కుమార్ , జిల్లా కార్యదర్శి రాగి వేణు, రాష్ట్ర మైనార్టీ జనరల్ సెక్రెటరీ అక్తర్ , మైనారిటీ అధ్యక్షులు అనిస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సహదేవ యాదవ్ , మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ , కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రమౌళి , వైస్ ఎంపీపీ సురేష్ గౌడ్ , వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి వెంకటేష్, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాబా , గొర్ల జాన్ , అబ్దుల్లా , రాధాకృష్ణ , లక్ష్మయ్య , విజయ్, సితయ్య , అలీష్ అమ్మ, నరసమ్మ , యాదమ్మ , నారాయణమ్మ, ఇందిర, నాగన్న పాల్గొన్నారు.