రఘవీరా పార్టీనీ పక్కన పెట్టేశారు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రఘవీరా పార్టీనీ పక్కన పెట్టేశారు

అనంతపురం, నవంబర్ 1, (way2newstv.com)
ద‌క్షిణాదిలో ముఖ్యంగా ఉమ్మ‌డి ఏపీలో త‌న‌దైన శైలిలో దూసుకుపోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పూర్తిగా తుడిచి పెట్టుకు పోయింది. ఎక్క‌డా కాంగ్రెస్ జెండా కూడా క‌నిపించ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. రాష్ట్ర విభ‌జ‌నతో తెలంగాణ‌లో అదికారం వ‌స్తుంద‌ని, ఏపీలో ఇబ్బంది ఉన్నా.. క్ర‌మక్ర‌మంగా పార్టీ పుంజుకుంటుంద‌ని భావించిన కాంగ్రెస్ అధిష్టానం ఏపీ ప్ర‌జ‌లు వ‌ద్ద‌న్నా కూడా తెలంగాణ విభ‌జ‌న‌కే మొగ్గు చూపింది. అయితే, దుర‌దృష్టం ఏంటంటే.. తెలంగాణ‌లో అధికారం ద‌క్క‌క‌పోగా.. ఏపీలో పార్టీ పూర్తిగా అస్తిత్వం కోల్పోయింది. కీల‌క‌మైన ఉద్ధండులు కూడా పార్టీకి దూర‌మ‌య్యారు.నిజానికి 2014లో ఉన్న ప‌రిస్థితిని చూసిన అప్ప‌టి కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్‌గా ఉన్న ర‌ఘువీరారెడ్డి.. వ‌చ్చే 2019 ఎన్నిక‌ల నాటికి పార్టీని గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్థానంలో కూర్చోబెడ‌తాన‌ని చెప్పారు. 
రఘవీరా పార్టీనీ పక్కన పెట్టేశారు

ఈ క్ర‌మంలో ఆయ‌న రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించి ఘ‌ర్ వాప‌సీ నినాదం కూడా ఇచ్చారు. అధికార ప‌క్షంతోను, ప్ర‌తిప‌క్షంతోనూ స‌మాన దూరం పాటించారు. అయితే, గ‌త ఏడాది తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ పోయి పోయి.. త‌మ‌కు బ‌ద్ధ శతృవు అయిన టీడీపీతో పొత్తు పెట్టుకోవ‌డం ఏపీలో తీవ్ర ప్ర‌భావం చూపించింది. తెలుగు దేశం పార్టీతో ఏపీలో పొత్తు ఉండ‌ద‌ని చెప్పినా.. నాయ‌కులు ప‌ట్టించుకోలేదు. పైగా ప్ర‌జ‌ల్లోనూ తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింది.దీంతో ర‌ఘువీరా ఇచ్చిన పిలుపు, ఆయ‌న పెట్టుకున్న ల‌క్ష్యం కూడా 2019 ఎన్నిక‌ల్లో పార్టీ సాధించ‌లేక పోయింది. ఈ నేప‌థ్యంలోనే ర‌ఘువీరా పార్టీకి దూర‌మ‌య్యారు. త‌న‌కు ఇచ్చిన చీఫ్ ప‌ద‌వికి ఆయ‌న రాజ‌నామా చేశారు. అంతేకాదు, పార్టీ వ్య‌వ‌హారాల్లోనూ ఆయన ఎక్క‌డా వేలు పెట్ట‌డం లేదు. పార్టీ ఉందా ? లేదా ? అనే విష‌యాల‌ను కూడా ర‌ఘువీరా ప‌ట్టించుకోవ‌డం లేదు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో సొంత ప‌నులు చేసుకుంటూ కాలం గ‌డుపుతున్నారు. ఇక 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి పెనుకొండ‌లో ఓడిన ర‌ఘువీరా ఈ యేడాది మ‌ళ్లీ క‌ళ్యాణ‌దుర్గంలో పోటీ చేసి ఓడిపోయారు.ఇక ర‌ఘువీరారెడ్డి పూర్తిగా పార్టీ కార్య‌క‌లాపాల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఇలా ఉన్న పార్టీని ఎవ‌రు నిల‌బెడ‌తారు ? ఎవ‌రు ముందుకు వ‌స్తారు ?అనేది చర్చగా మారింది. తనకు ఆత్మీయుడైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్ ముఖ్యమంత్రి కావడంతో ప్రభుత్వంపై విమర్శించేందుకు కూడా రఘువీరారెడ్డి ఇష్టపడటం లేదు. ఎవ‌రికి వారు పార్టీని వ‌దిలి వేరే పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. ఎక్క‌డా ఉద్య‌మాలు కానీ, నిర‌స‌న‌లు కానీ చేప‌ట్టే నాయ‌కులు కానీ, జెండా మోసే కార్య‌క‌ర్త‌లు కానీ లేక పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఎప్ప‌టికి ఈ పార్టీకి బాగుప‌డుతుందో ? పుంజుకుంటుందో చూడాలి.