చెన్నై, నవంబర్ 14 (way2newstv.com)
బ్లాక్ బికినీలో శ్రియ అందాలు అభిమానులకు మత్తెక్కిస్తున్నాయి. పోస్ట్ చేసిన 12 గంటల్లోనే ఈ వీడియోకు 3.27 లక్షలకు పైగా లైక్స్ రావటం విశేషం. అంతేకాదు 650కి పైగా కామెంట్స్ వచ్చాయి. ‘ఇష్టం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రియ తరువాత స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్‌బాబు, ప్రభాస్, రవితేజ.. ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.అయితే యంగ్ జనరేషన్ ఎంట్రీతో శ్రియకు అవకాశాలు తగ్గాయి.
మత్తెక్కిస్తున్న శ్రియ అందాలు
అయితే ఇప్పటికీ సీనియర్ హీరోల సరసన నటిస్తూ మెప్పిస్తోంది ఈ బ్యూటీ. సినిమాల్లోనూ నటిస్తూనే వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటీ. ఇటీవల రష్యన్ మ్యూజీషియన్ ఆండ్ర్యూని వివాహం చేసుకుంది. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ ఆండ్రూతో కలిసి మ్యూజిక్ షోస్‌లో పాల్గొంటుంది శ్రియ.ఈ భామ చివరగా నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాలో నటించింది. అయితే వెండితెర మీద పెద్దగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది శ్రియ. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు వీడియోలతో అభిమానులను అలరిస్తుంటుంది