పవన్ పై మండిపడ్డ అవంతి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పవన్ పై మండిపడ్డ అవంతి

విశాఖపట్నం నవంబర్ 04  (way2newstv.com)
గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి ఉన్న చీకటి ఒప్పందంతోనే ప్రజలను జనసేనను తిరష్కరించారని మంత్రి అవంతి శ్రీనివాస్ రావు విమర్శించారు.  చంద్రబాబు వయస్సు మీరిపోవడంతో పవన్ కళ్యాణ్ ను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు టిడిపి నేతలైన అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడుతో కలవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వాళ్ళు లేకుండా విశాఖలో పవన్‌ సభ పెట్టలేరా అని విమర్శించారు. 
పవన్ పై మండిపడ్డ అవంతి

విజయసాయి రెడ్డిని విమర్శించడానికి పవన్‌కు ఏం అర్హత ఉందన్నారు. విజయసాయి రెడ్డిలా రాజ్యసభలో  ఎవరూ మాట్లాడలేరని, పవన్‌ సినిమాల్లో సంపాదించిన సొమ్మును భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాలని సూచించారు. పవన్‌ లాగా అసభ్యంగా ఎవ్వరూ మాట్లాడరని అవంతి విమర్శించారు.  జగన్‌పై పెట్టినవి తప్పుడు కేసులని ప్రజలే తీర్పునిచ్చారన్నారు. విపక్షంలో ఉన్నప్పుడు కేసులు పెట్టడం సాధారణమని అవంతి శ్రీనివాస్‌ అన్నారు.