త్యాగాలతోనే స్వేచ్చావాయువులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

త్యాగాలతోనే స్వేచ్చావాయువులు

ఏలూరు, నవంబర్ 01,(way2newstv.com):
పొట్టి శ్రీరాములు వంటి ఎందరో త్యాగధనులు త్యాగఫలితంగా లభించిన స్వేచ్చావాయువులతో బంగారు భవిష్యత్ వైపు మనమంతా కలిసికట్టుగా అడుగులు ముందుకువేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆళ్లకాళీకృష్ణ శ్రీనివాస్ చెప్పారు. ఆంద్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం  సందర్భంగా శుక్రవారం స్థానిక కోటదిబ్బలోని  కస్తూరిబా నగరపాలక బాలికోన్నత పాళశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆళ్ల నాని పాల్గొని మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలితంగా మనమంతా ఈ రోజు స్వేచ్చగా  సంతోషంగా జీవించగలుగుతున్నామని, అటువంటి త్యాగమూర్తుల త్యాగాలను ప్రతి ఒక్కరూ మననం చేసుకోవాలన్నారు. 
త్యాగాలతోనే స్వేచ్చావాయువులు

ఎంతో అంగరంగవైభవంగా జరుపుకునే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం గత ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా విస్మరించడం చాలా బాధాకరమన్నారు. మన యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషంగా  వుందన్నారు. స్వేచ్చావాయువులు ప్రసాధించిన త్యాగధనుల  లక్ష్యాలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి ముందుకుసాగుతున్నారని, అందుబాగంగానే  ప్రజాప్రయోజనాలకోసం అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారన్నారు. అందులో ప్రధానంగా విధ్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ  అమ్మఒడి పధకం ప్రవేశ పేట్టారన్నారు. విద్యార్ధులకు బంగారు భవిష్యత్  ఇవ్వాలన్నా, వారు భావిభారత పౌరులుగా  ఎదగాలన్నా విద్యధ్వారానే సాధ్యమన్నారు. రాష్ట్రానికే కాకుండా దేశానికే భావిభారత పౌరులను అందించాలంటే  విధ్య యొక్క గొప్పతనం గుర్తించి  తమ పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి సంవత్సరానికి  15 వేల రూపాయలు అందించే కార్యక్రమం తీసుకురావడం జరిగిందన్నారు. చిన్నతనం నుండి పిల్లల్లో కులమత వర్గబేదాలు, పేద ధనిక బేదాలు లేకుండా  ఉండాలంటే విధ్యధ్వారానే సాధ్యమన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ను విద్యార్ధులకు  అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలను దశలవారీగా వచ్చే 4 సంవత్సరాలలో  నూరుశాతం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావంతులైన అన్ని అర్హతలు గల ఉపాధ్యాములు వున్నారని ప్రయివేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల్లో విధ్యాభహోదన అందించడం జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వం అందించే  అన్ని  సౌకర్యాలు విద్యార్ధినీ విద్యార్ధులకు అందేలా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ధనిక వర్గాలతో దీటుగా నిరుపేదలకు కూడా సంపూర్ణ ఆరోగ్య అందించాలనే లక్ష్యంలో దివంగత ముఖ్యమంత్రి డా.రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పధకానికి ఆయన తనయుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరిన్ని మెరుగుదిద్ది ఎన్నో ప్రయోజనాలు అందేలా ప్రణాళికలు రూపొందించారని  చెప్పారు. పొట్టి శ్రీరాములు, మహాత్మాగింధి, తెలుగు తల్లి విగ్రహాలకు పులమాలలు వేశారు.  అనంతరం కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు ప్రారంభించారు. విద్యార్ధినీ విద్యార్ధులకు కంటిలో పాలను గుర్తించి సరైన చికిత్స అందించడంతో పాటు  అవసరమైన వారికి కళ్లజోళ్లను అందించడం జరుగుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ సాంస్కకృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జాంయిట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్.2 నంబూరి తేజ్ భరత్ , వివిద శాఖల జిల్లా అధికారులు, విద్యార్ధినీ,విద్యార్ధులు పాల్గొన్నారు.