కాలువ పనులు ప్రారంభం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కాలువ పనులు ప్రారంభం

కొల్లాపూర్ నవంబర్ 12, (way2newstv.com)
కొల్లాపూర్ 20 వ వార్డులో కాలువ పనులు,సీసీ రోడ్ల పనులు ప్రారంభం అయ్యాయి.  కొల్లాపూర్ లోని 20 వ వార్డులో రెండు దశాబ్దాల కు పైగా సైడ్ డ్రైన్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కాలనీ వాసులు విజ్ఞప్తుల మేరకు వెంటనే స్పందించిన  శాసన సభ్యుడు  బీరం హర్షవర్ధన్ రెడ్డి మున్సిపాలిటీ అధికారులకు  ఆదేశాలు ఇవ్వడంతో  మంగళవారం కాలువ పనులకు మోక్షం లభించింది.   
కాలువ పనులు ప్రారంభం

ఉదయం కొల్లపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్  గున్ రెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్  వెంకటయ్య,  సివిల్ హాస్పిటల్ చైర్మన్  కాటం జంబులయ్య  సైడ్ డ్రైన్ పనుల్ని ప్రారంభించారు.  కాలనీ వాసి  కట్ట చంద్ర రెడ్డి టెంకాయ కొట్టి పనులను ప్రారంభించారు.అదే విధంగా కాలనీ లో 350 మీటర్ల సీసీ రోడ్డు పనులను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏ. ఈ నరసింహ, మన్యం, చంద్రశేఖర చారి,  సోమిశెట్టి చంద్రశేఖర్ శెట్టి,  కంరుద్దీన్ , జాఫర్, నాగులపల్లి లక్ష్మయ్య,  కాలనీ వాసులు చంద్ర రెడ్డి సర్, గోపి శెట్టి,  ఇటుకల రాజు యాదవ్, భాస్కర్ నాయక్ పాల్గొన్నారు.