సేమ్ టూ సేమ్... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సేమ్ టూ సేమ్...

బాబు బాటలోనే జగన్
విజయవాడ, నవంబర్ 1  (way2newstv.com)
రాజ‌కీయాల్లో సింప‌తీకి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చినా.. ప్రజ‌ల సానుభూతి ప‌వ‌నాలు వీయాల్సిందే. ఎంత అనుభ‌వం ఉన్నా.. ప్రజ‌ల‌ సింప‌తీ ముందు బ‌లాదూరే..! ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇది నిరూపితం కూడా అయింది. ముఖ్యంగా ఏపీ ప్రజ‌ల‌కు సింప‌తీ ఎక్కువ‌. వారికి ఆగ్రహం వ‌చ్చినా.. అనుగ్రహం వ‌చ్చినా ప‌ట్టుకునే ప‌రిస్థితి ఉండ‌దు. 2014లో అనుభ‌వం నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ప‌ట్టం క‌ట్టిన ఏపీ ప్రజ‌లు ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌పై సానుభూతి చూపించారు. క‌నీవినీ ఎరుగ‌ని మెజారిటీ ఇచ్చి మ‌రీ అధికారం అప్పగించారు. ఈ సింప‌తీ రెండు ర‌కాలుగా జ‌గ‌న్‌కు ప‌నిచేసింది.ఏపీ ప్రజ‌లు చూపించిన సింప‌తీ విష‌యాన్ని తీసుకుంటే.. జ‌గ‌న్ విష‌యంలో రెండు ర‌కాలుగా ఉంది.
సేమ్ టూ సేమ్...

ఒక‌టి ఆయ‌న చేసిన సుదీర్ఘ పాద‌యాత్ర. ఈ యాత్ర ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజ‌లు జగన్ కి క‌నెక్ట్ అయ్యారు. ఇక‌, రెండోది చంద్రబాబుపై కోపం.. జ‌గ‌న్‌కు సింప‌తీగా మారింది. జ‌గ‌న్ పార్టీకి చెందిన 23 మంది వైసీపీ ఎమ్మెల్యేల‌ను చంద్రబాబు త‌న పార్టీలోకి చేర్చుకోవ‌డాన్ని ప‌ట్టణ‌, న‌గ‌ర ప్రాంతాల్లోని ప్రజ‌లు స‌హించ‌లేక పోయారు. దీంతో జ‌గ‌న్‌పై సానుభూతి చూపించారు. ఈ క్రమంలోనే ఆయ‌న‌కు ఓట్లు, సీట్లు కూడా పెరిగాయి. అయితే, ఇప్పుడు బాబు చేసిన త‌ప్పునే జ‌గ‌న్ చేస్తున్నారా ? అనే సందేహం వ‌స్తోంది.జగన్ కు ఇప్పుడు అవ‌స‌రం లేకున్నా కూడా చంద్రబాబు పార్టీ నుంచి జంపింగుల‌ను ప్రోత్సహిస్తున్నారు. రాజ‌కీయ వ్యూహాల్లో ప్రత్యర్థుల‌ను నామ‌రూపాలు లేకుండా చేయాల‌నేది నిజ‌మే. అయితే, ఏపీ ప్రజ‌లు ఇలాంటి ప‌రిస్థితిని స‌హించ‌ర‌నే విష‌యం ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో తేలిపోయింది. అయినా కూడా జ‌గన్ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేల‌కు వ‌ల‌విసురుతున్నారు. వ‌చ్చిన వారిని వ‌చ్చిన‌ట్టు రాజీనామా చేయించి త‌న టికెట్‌పై గెలిపించుకునేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. అది ప్రస్తుతానికి త‌న‌కు తిరుగులేద‌ని నిరూపించుకునేందుకు జగన్ కు బాగా యూజ్ అవుతుంది.జ‌గ‌న్ ఇలా చేస్తే చంద్రబాబు చూస్తూ ఊరుకోరు క‌దా.. త‌న పార్టీ నేత‌ల‌ను తీసుకుని, టికెట్లు మార్చి గెలిపించుకున్నార‌ని ఆయ‌న ప్రజ‌ల్లో ప్రచారం చేయ‌డం ఖాయం. అంతిమంగా ఇది జ‌గ‌న్‌కు ఇబ్బందిక‌ర ప‌రిస్తితిని తెచ్చిపెట్టడంతోపాటు అదే స‌మ‌యంలో చంద్రబాబుపై ప్రజ‌ల్లో పోయిన సింప‌తీని తెచ్చిపెట్టిన‌ట్టవుతుంది. మ‌రి ఇదే జ‌రిగితే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి జ‌గ‌న్ ఇబ్బందుల్లో ప‌డ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి దీనిని దృష్టిలో పెట్టుకుని జ‌గ‌న్ జాగ్రత్తగా వ్యవ‌హ‌రిస్తే మేల‌ని సూచిస్తున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.