బాధితులకు సత్వర న్యాయం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బాధితులకు సత్వర న్యాయం

ఏలూరు, నవంబర్ 18,  (way2newstv.com)
కులమతాలకు, పార్టీలకు అతీతంగా బాధితులకు సత్వరన్యాయం జరిగేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు జిల్లా కలెక్టర్  రేవు ముత్యాలరాజు ఆదేశించారు. ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లాలొని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి కలెక్టర్ వినతులు, పిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కాళ్లమండలం పేంపాడు గ్రామానికి చెందిన  బండారు శ్రీరామానుజులు అర్జీ సమర్పిస్తూ గ్రామంలో తన ఇంటినుండి వాడుకపునీరు, వర్షపునీరు బయటకు వెళ్లుటకు సుమారు 40 సంవత్సరాల నుండి సిమెంట్ డ్రైనేజీ ఉందని అయితే ఇటీవల సరిహద్దుదారులు గొట్టుముక్కుల రత్నకుమారి, నిల్లా చిన్న బసవేశ్వరరావు, తమ్మా సుబ్బారావు అనేవారు లారీ ఎర్ర కంకరతో డ్రైనేజి పూడ్చివేశారన్నారు. 
బాధితులకు సత్వర న్యాయం

ఇదేమి అన్యాయం అని ప్రశ్నిస్తే వారు మరికొందరిని తీసుకువచ్చి ప్రశ్నించిన తనపైనా తనభార్య, తన తమ్మునిపైగా దౌర్జన్యం చేసి కొట్టారన్నారు. ఈ నెల 4 న  కాళ్ల పోలీసు స్టేషన్ లో పిర్యాదుచేసి భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలోను తరువాత ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోను వైధ్యం చేయించుకున్నామనని చెప్పారు. పోలీసులు నేను ఇచ్చిన పిర్యాదులపై ఎఫ్ఐఆర్ నమెదుచేసి కాపీ తనకు ఇవ్వవలేదని, దౌర్జన్యం చేసిన వారిపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తనకున్యాయం చేయాలని కలెక్టర్ ను వేడుకున్నారు. ఈ పిర్యాదుపై కలెక్టర్ స్పందిస్తూ న్యాయంకోసం పోలీస్లను ఆశ్రయించే బాధితుల పిర్యాదులను స్వీకరించడంలోను, ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలోను సంబంధిత పోలీసులు నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. పేదప్రజలు తమ జరిగిన అన్యాయాలను పోలీసుల దృష్టికి తీసుకువెళితే న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతో నమ్మకంతో వస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా అధికారులు వచ్చిన బాధితులను గౌరవంగా చూసుకుని వారి బాధలు శ్రద్దగా వినాలన్నారు. పిర్యాదులు తీసుకుని వెంటనే ఎఫ్ఐఆర్ నమోదుచేసి నిబంధనల మేరకు బాధితులకు ఎఫ్ఐఆర్ కాపీని ఇవ్వాలన్నారు. వచ్చే పిర్యాదులపై తక్షణం స్పందించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.కొయ్యలగూడెం మండలం కొయ్యలగూడెం గ్రామానికి చెందిన పరసాల విజయకుమారి పిర్యాదు చేస్తూ దేవరపల్లిగ్రామానికి చెందిన కర్రి భీమేశ్వరరావు అనే వ్యక్తి తనకు 10 లక్షల సబ్సిడీ ఋణం ఇప్పిస్తానని నమ్మబలికి సబ్సిడీ సొమ్ము చెల్లించాలంటూ తనఖాతాలో 3 లక్షల రూపాయలు వేయించుకున్నారని చెప్పారు. ఆర్దికంగా నిలుదొక్కుకోవచ్చుననే ఉద్దేశ్యంతో ఆశపడి సొమ్ము చెల్లించానని కాని ఇంతవరకు ఋణం ఇప్పించకపోతే ఇచ్చిన సొమ్ములు తిరిగి ఇవ్వాలని అడిగితే దౌర్జన్యం చేస్తూ నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోఅని బెదిరిస్తున్నారని కలెక్టర్ కు తమ బాధలు చెప్పుకున్నారు.