నారాయణ ఔట్... సోమిరెడ్డి ఇన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నారాయణ ఔట్... సోమిరెడ్డి ఇన్

నెల్లూరు, నవంబర్ 9, (way2newstv.com)
రాజ‌కీయాల్లో ఏ పార్టీకైనా, ఏ నాయ‌కుడికైనా.. గెలుపు ఓట‌ములు స‌హ‌జం. నేడున్న ప‌ద‌వులు రేపు ఉంటాయనే గ్యారెంటీ లేదు. అయితే, పార్టీలు మాత్రం ఉంటాయి. కానీ, నాయ‌కులే త‌మ‌కు న‌చ్చిన విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో టీడీపీ ప‌రాజ‌యం పాలైన త‌ర్వాత ఈ పార్టీలోని చాలా మంది నాయ‌కులు క‌లుగుల్లోకి వెళ్లిపోయారు. టీడీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో త‌మ‌కు తిరుగులేద‌న్నట్టుగా వ్యవ‌హ‌రించిన త‌మ్ముళ్లు చాలా మంది ఇప్పుడు అధికారం కోల్పోయిన త‌ర్వాత మాత్రం నాయ‌కులు త‌మ త‌మ వ్యాపారాలు, వ్యవ‌హారాల్లో మునిగి తేలుతున్నారు. త‌ప్ప. టీడీపీని ఎక్కడా ప‌ట్టించుకుంటున్న దాఖ‌లా క‌నిపించ‌డం లేదుప్రధానంగా నెల్లూరు జిల్లాలో టీడీపీ నాయ‌కుల ప‌రిస్థితి మ‌రింత దారుణంగా త‌యారైంది. 
నారాయణ ఔట్... సోమిరెడ్డి ఇన్

నిన్న మొన్నటి వ‌ర‌కు పార్టీ అధికారంలో ఉండ‌గా ఇక్కడి నాయ‌కులు త‌మ‌దే రాజ్యం అన్నట్టుగా వ్యవ‌హ‌రించారు. కానీ, ఇప్పుడు పార్టీ ప్రతిప‌క్షంలోకి రాగానే, తాము ఓడిపోగానే.. ప్లేట్ ఫిరాయించేశారు. వారు వీరు అనే తేడా లేకుండా అంద‌రిదీ ఇదే ప‌రిస్థితి. వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండు సార్లు విజ‌యం సాధించిన పార్టీ సీనియ‌ర్ నేత కురుగొండ్ల రామ‌కృష్ణ, ఉద‌య‌గిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత అడ్రస్ లేరుఇక ఆత్మకూరులో ఎన్నిక‌ల‌కు ముందు రంగంలోకి దిగి టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిన మ‌రో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య సైతం రాజ‌కీయాల్లో కొన‌సాగేందుకు ఇష్టప‌డడం లేదు. ఇక కావ‌లిలో మాజీ ఎమ్మెల్యే బీద మ‌స్తాన్ రావు, ర‌విచంద్ర సోద‌రులు, బొమ్మిరెడ్డి రాఘ‌వేంద్ర రెడ్డి (ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ నుంచి వ‌చ్చి టీడీపీలో చేరిపోయారు) ఎక్కడా క‌నిపించ‌డం లేదు. ఇక రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గాలు సూళ్లూరుపేట‌, గూడూరులో ప‌రిస్థితి ఘోరంగా ఉంది. అస‌లు ఇక్కడ జెండా క‌ట్టి, పార్టీ కార్యక్ర‌మాలు నిర్వహించే నాయ‌కులు కూడా క‌రువయ్యారు.ఎన్నిక‌లు ముగిసి ఐదు మాసాలు ముగిసినా.. వీరు ఎక్కడ ఉన్నారో కూడా అర్దం కావ‌డం లేదు. మ‌రోప‌క్క టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం వైసీపీపై యుద్ధానికి ఎప్పటిక‌ప్పుడు పిలుపునిస్తున్నారు. ప‌లు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాయ‌కులు అధికార పార్టీపై విమ‌ర్శలు కురిపించాల‌ని ఆదేశిస్తున్నారు. అయినా కూడా టీడీపీ నాయ‌కులు మాత్రం ఎక్కడా మ‌న‌కు క‌నిపించ‌డం లేదు. అయితే, ఏకైక నాయ‌కుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి మాత్రం పార్టీలో నిత్యం క‌నిపిస్తున్నారు.ఆయ‌న నిత్యం మీడియా ముందుకు వ‌స్తున్నారు. ప్రభుత్వంపై విమ‌ర్శలు కురిపించ‌డంతోపాటు పార్టీకి అండ‌గా నిలుస్తున్నారు. వాస్తవానికి ఈయ‌న ఐదు సార్లు ఓడిపోయారు అయిన‌ప్పటికీ.. ఓట‌మి భారాన్ని ప‌క్కన పెట్టి పార్టీ కోసం కృషి చేస్తున్న నాయ‌కుడిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. దీంతో టీడీపీ కూడా ఇప్పుడు ఈయ‌న‌నే న‌మ్ముకుంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక మ‌రో మంత్రి నారాయ‌ణ అధికారం ఉన్నప్పుడు మాత్రం త‌న హ‌వానే న‌డిపించాల‌ని అనుకున్నారు. ఇప్పుడు ఓడిపోయాక నాకు ఈ రాజ‌కీయం ఎందుకు ? వ్యాపారాలు చాల‌న్న నిర్ణయానికి వ‌చ్చేశార‌ట‌. టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజుల పాటు నెల్లూరులో ఉండి నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేసినా ఫలితం లేదన్నది వాస్తవం. ఇది నెల్లూరు టీడీపీ రాజ‌కీయం.