శ్రీశైలం నవంబర్ 4, (way2newstv.com)
శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీకమాసంలో మొదటి సోమవారానికి శ్రీశైలం పురవీధులు కిక్కిరిసిపోయాయి. శివునికి అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీకమాసంలో భక్తులు శివపార్వతులను దర్శించుకుంటే కోటిజన్మల పుణ్యం దక్కుతుందనే నమ్మకం తో భారీ ఎత్తున భక్తులు శ్రీశైలానికి చేరుతున్నారు. ఇప్పటికే ఆదివారం సెలవుదినం కావడంతో శనివారం నుంచే భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలం చేరుకొని వేకువజామునే పాతాళ గంగ వద్దకు చేరుకొని పుణ్య స్నానాలను ఆచరించి గంగాధర మండపం,నాగుల కట్ట వద్ద కార్తీక దీపాలను కుటుంబ సమేతంగా వెలిగించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
శ్రీశైలంలో కార్తీక సోమవారం భక్తుల రద్దీ
మొదటి కార్తిక సోమవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి రానున్నారని కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.ఈ రోజు ఆలయం ప్రక్కన ఉన్న పుష్కరిణి వద్ద లక్ష దీపార్చన జరగనుంది దీనికోసం భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు ఆలయంలో క్యూలైన్ల వద్ద ఉచిత అల్పాహారం మంచినీళ్లు అందించడమే కాక భక్తునికి దర్శనం ఏర్పాట్లను దగ్గరుండి ఆలయ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.