హైదరాబాద్ నవంబర్ 20 (way2newstv.com)
ఉస్మానియా యూనివర్సిటీ కి చెందిన రీసెర్చ్ స్కాలర్ శ్రీనాధ్ సోదరుడు యరకల వేణుగోపాల్ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గత మూడు నెలలుగా ఆసుపత్రిలో కోమాలో ఉండిపోమాడు. ఆర్థికంగా చితికిపోయిన అయన కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించాలని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు కి ఉస్మానియా యూనివర్సిటీ కి చెందిన రీసెర్చ్ స్కాలర్స్ విజ్ఞప్తి చేసారు.
ఓయూ స్కాలర్ కుటుంబానికి చేయూతనిచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.
స్పందించిని మంత్రి యరకల శ్రీనాధ్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 4,00000/- రూపాయల చెక్కు ను మంత్రి అందించారు.మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఆసరాగా నిలుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీజీవో నాయకులు రవీందర్ గౌడ్, ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ కేశబోయిన రవికుమార్, సురేష్, గిరి, శ్యామ్, యాకుబ్, మహేష్, నవీన్ , శ్రీరామ్, లవన్ లు పాల్గొన్నారు.