విశాఖపట్నం నవంబర్ 02,(way2newstv.com):
నరేంద్రమోదీ ప్రభుత్వంలో దేశ వ్యాప్తంగా వేలాది మంది ఆయుష్మాన్ భారత్ పధకంలో లబ్ది పొందుతున్నారని కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యమే ప్రధాన ధ్యేయంగా కేంధ్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని చెప్పారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం దీనిని వై ఎస్ ఆర్ ఆరోగ్య శ్రీ, నరేంద్రమోదీ ఆలోచనతో భాగంగా ఈ పధకం నడుస్తోందని అన్నారు.
ప్రజా ఆరోగ్యమే ధ్యేయం
ముద్ర యోజన, ఉజ్వల యోజన, కిసాన్ యోజన లాంటి పధకాలు ప్రజలకు చాలా లబ్ది చేకూరుస్తున్నాయని,రైల్వే జోన్ ప్రకటించడంలో తను భాగ స్వామిగా ఉన్నానని చెప్పారు. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి జరుగుతోందని అన్నారు. ముఖ్యంగా నరేంద్రమోదీ ఆలోచనలో భాగగానే ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ఉద్భవించిందని అన్నారు. రాష్ట్రాభివృద్దికి కేంధ్ర ప్రభుత్వం చిత్తుశుద్దితో వ్యవహరిస్తోందని అన్నారు.