కాంట్రాక్టర్లను ఇబ్బందులు పడుతున్నారు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కాంట్రాక్టర్లను ఇబ్బందులు పడుతున్నారు

విజయవాడ నవంబర్ 18 (way2newstv.com)
విజయవాడ హోటల్ ఇంద్ర ప్రస్త హోటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కాంట్రాక్టర్ల అత్యవసర సమావేశం జరిగింది. ప్రభుత్వం తక్షనమే పెండింగ్ బిల్లులు చెల్లించాలని సమావేశంలో తీర్మానం చేసారు. అవినీతి జరిగిందనే పేరుతో పనులు చేసిన కాంట్రాక్టర్లను ఇబ్బందులు పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పనులు పూర్తయిన వాటికి సంబంధించి  కోట్లాది రూపాయలు పెండింగ్ ఉన్నాయి. 
కాంట్రాక్టర్లను ఇబ్బందులు పడుతున్నారు

అవినీతి జరిగితే చర్యలు తీసుకోవాలి తప్ప బిల్లులు నిలిపివేయకూడదు.  ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న మమ్మల్ని ఇబ్బందులు పెట్టడం వల్ల కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. త్వరలో సీఎంని కలిసి సమస్యను వివరిస్తామని అన్నారు. మేము చేసిన చేయబోయే ప్రాజెక్టులకు సంబంధించిన వాటిపై రివర్స్ టెండరింగ్ కు వెళ్లిన మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. రూ 500 కోట్ల రూపాయల  బిల్లులను నిలిచిపోవడం వల్ల  కాంట్రాక్టర్లు ఆవేదన చెందుతున్నారు. కాంట్రాక్టర్లపై ఆధారపడిన  కార్మికులు రోడ్డున పడ్డారని అన్నారు.