కొద్ది రోజుల్లో పుష్కలంగా ఇసుక

విశాఖపట్నం నవంబర్ 4, (way2newstv.com)
గత ప్రభుత్వంలో యధేచ్ఛగా ఇసుక దోపిడీ జరిగింది.  ఇపుడు వరదల వల్ల ఇసుక లేదుగానీ అవినీతి వల్ల కాదు.  వైకాపాలో ఎవరన్నా ఇసుకలో అవినీతికి పాల్పడుతున్నామని నిరూపిస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటామని ఎంపీ ఎంవివి సత్యనారాయణ అన్నారు. 
కొద్ది రోజుల్లో పుష్కలంగా ఇసుక

సోమవారం అయన మీడియాతో మాట్లాడారు.  కోర్టులు, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల వల్ల ఎక్కడ పడితే అక్కడ ఇసుక తవ్వే అవకాశం లేదు.  అతి కొద్ది రోజుల్లో ప్రజలకు ఇసుక పుష్కలంగా లభిస్తుంది. జగన్ ఏనాడూ వ్యక్తిగత దూషణలకు దిగలేదని అన్నారు.
Previous Post Next Post