నేతలు..బూతు పురాణాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నేతలు..బూతు పురాణాలు

విజయవాడ,  నవంబర్ 19, (way2newstv.com)
ప్రత్యర్థులపై తిట్ల పురాణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రికార్డ్ ఇప్పట్లో బద్దలు అవుతుందని పొలిటికల్ పండితులు ఊహించి ఉండరు. ఇప్పుడు టి సిఎం రికార్డ్ ను అలవోకగా అధిగమించి సరికొత్త రికార్డ్ కి తెరతీశారు గన్నవరం ఎమ్యెల్యే వల్లభనేని వంశీ, మంత్రి కొడాలి నాని. ఇప్పుడు వారు నోరు విప్పితే హడలిపోయే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశానికి ఎదురైంది. అడ్డమైన తిట్లు తిట్టడంలో ఇన్నాళ్లు జెసి దివాకర రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బోండా ఉమా, వర్ల రామయ్య, బాబు రాజేంద్రప్రసాద్, దేవినేని ఉమా టిడిపి ప్రధాన అస్త్రాలుగా అధికారంలో వున్నప్పుడు చురుగ్గా పనిచేశారు.అధికార మార్పిడి జరిగి ఎపి లో అధికారంలోకి వైసిపి వచ్చాక తిట్ల దండకం తగ్గించారు. విపక్ష నేత జగన్ ను ఈ నేతలతో నానా తిట్లు తిట్టించి గతంలో చంద్రబాబు అండ్ పార్టీ ఆనంద పడేది. అయితే ఇప్పుడు బాబు పాత్రలోకి జగన్ మారారు. 
నేతలు..బూతు పురాణాలు

తమ పార్టీ నేతలు ఇంతకాలం హుందాగా కౌంటర్ లు ఇస్తుంటే ప్రజలు కూడా పట్టించుకోవడం లేదన్న అంచనాకు వచ్చిన వైసిపి ఇప్పుడు గేర్ మార్చి తిట్ల పురాణంలో తమనేతలు ఎట్టి పరిస్థితుల్లో తీసిపోరని రుజువు చేస్తుంది.వైసిపి అటాకింగ్ మోడ్ లోకి వల్లభనేని వంశీ తో వచ్చేసింది. ఆ ట్రెండ్ ను ఇప్పుడు వంశీ మిత్రుడు మంత్రి నాని అందిపుచ్చుకుని దుమ్ము దులిపేస్తున్నారు. వీరి దూకుడు చూసి నాని కన్నా వంశీ నే బెటర్ అనే ధోరణికి వచ్చేశారు. అమ్మ, అక్కలతో సహా తాతలు తండ్రులను సైతం కొడాలి నాని వదిలిపెట్టడం లేదు. ఆయన వేస్తున్న చాలా ప్రశ్నలకు టిడిపి దగ్గర జవాబులు లేని పరిస్థితి సాగుతుంది. ఇక ఎపి పొలిటికల్ ఎక్స్ ట్రా జబర్దస్త్ షో కి నెటిజెన్స్ లో విపరీతంగా ఆదరణ పెరిగింది. బూతులు, పంచ్ డైలాగ్ లతో రేటింగ్స్ లో దూసుకుపోయే ఈటివి ఎక్స్ ట్రా జబర్దస్తు షో నాని వంశీ జోరు ముందు వెలవెలపోతుంది. అవకాశం కోసం ఎన్నో ఏళ్ళుగా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ లపై అంతర్గతంగా రగిలిపోతున్న నేతలు ఇప్పుడు తమ గ్యాస్ ప్రత్యర్థులపై రిలీజ్ చేసి కొంత ఫ్రీఅయిపోయారు.సంప్రదాయానికి ప్రతిరూపంగా నిలిచే ఈ టివి వంటివి కూడా హాస్యం పేరుతో అభ్యంతరకర భాషను తన షో లలో ఉపయోగిస్తుంది. జనం బూతులు బాగా ఎంజాయ్ చేస్తున్నారనే ధోరణి దీనితో పెరగడంతో సినిమాల్లో కూడా ఒక మోతాదు మరీ పెరిగి బూతు డైలాగ్ లు పెరిగిపోయాయి. ఇటీవల వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో ప్రతి డైలాగ్ ద్వందార్ధాలు పామరులు వినియోగించే బూతులు డైరెక్ట్ గా హీరో, హీరోయిన్స్ చేత దర్శకుడు పూరి పలికించారు. అవి సూపర్ హిట్ కూడా అయ్యాయి.ఇక బూతులు తిట్లతో రాజకీయం చేయడంలో తెలంగాణ సిఎం కెసిఆర్, ఆయన తనయుడు కేటిఆర్, అల్లుడు హరీష్ రావు లకు ఒక ప్రత్యేకత వుంది. ఆ ధోరణి కూడా తెలంగాణ లో సక్సెస్ కావడంతో ఏపీలో ఇప్పుడు పొలిటికల్ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. నేరుగా నిస్సిగ్గుగా వైసిపి టిడిపి నేతలు నిందారోపణలు అభ్యంతరకర రీతిలోనే పెద్ద స్థాయిలో మొదలు పెట్టారు. న్యూస్ ఛానెల్స్, సోషల్ మీడియా లో ఇలాంటివాటికి బాగా రేటింగ్స్ ఉండటంతో ఆ మీడియా లు వీటిని బాగా ప్రోత్సహిస్తున్నాయి. చప్పగా ఉండే ప్రెస్ మీట్లను ప్రజలు చూసేందుకు ఇష్టపడకపోవడంతో ఈ ధోరణి రేటింగ్స్ కోసం ఈ ధోరణి మరింత పెరిగిపోతూ వస్తుంది. ఏదేమైనా పెరుగుట విరుగుట కొరకే అన్న చందంగా ఎదో రోజు ఆన్ పార్లమెంటరీ భాషకు నేతలు స్వస్తి పలకడానికి మరికొంతకాలం పట్టేలాగే వుంది.