పవన్ ఎన్నాళ్లు ఇలా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పవన్ ఎన్నాళ్లు ఇలా

ఏలూరు, నవంబర్ 19, (way2newstv.com)
జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ ఇప్పటికైనా తనలోని, తన పార్టీలోని లోపాన్ని గుర్తించారా? ఆయన ప్రజాసమస్యలపై స్పందిస్తున్న తీరు బాగానే ఉన్నా… వ్యక్తిగత విమర్శలు చేస్తున్న తీరే సరిగా లేదు. ఆయన ఎవరినైనా ఏమైనా అనొచ్చు. కానీ తనను ఎవరైనా అంటే మాత్రం ఊరుకోరు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించి దాదాపు ఆరేళ్లకు పైగానే అవుతుంది. ఇప్పటి వరకూ జనసేన పార్టీలో బలమైన గొంతుకలు లేకపోవడానికి కారణమేంటి? నాయకత్వాన్ని పవన్ కల్యాణ‌్ ఎదగనివ్వడం లేదా?పవన్ కల్యాణ్ కు రాష్ట్రమంతటా వీరాభిమానులు ఉన్నారు. మేధావులు, కొందరు రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు ఆయనకు గత ఎన్నికల్లో మద్దతుగా నిలిచారు. 
పవన్ ఎన్నాళ్లు ఇలా

అయితే వీరెవరినీ పవన్ కల్యాణ‌్ దరి చేరనీయడం లేదన్న సంగతి తాజా పరిణామాలను బట్టి తెలుస్తూనే ఉంది. ఒక పార్టీ అంటే నాయకుడి గొంతు మాత్రమే విన్పించకూడదు. అనేక మంది నాయకుల సమూహమే పార్టీ అవుతుంది. అయితే ఏ విషయంపైన స్పందించాలన్నా పవన్ కల్యాణ‌్ మాత్రమే ముందుకు రావడం గమనించాల్సిన విషయం.పవన్ కల్యాణ్ పార్టీలో బలంగా మాట్లాడగలిగిన వ్యక్తులు ఉన్నారు. నాదెండ్ల మనోహర్, జేడీ లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వంటి నేతలతో పాటు కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు సయితం పవన్ కల్యాణ్ వెంట ఉన్నారు. అయితే ప్రభుత్వంపై విమర్శలు చేయాలన్నా, పవన్ కల్యాణ్ పై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వాలన్నా ఆ గొంతులకు ఛాన్స్ దక్కదు. పవన్ కల్యాణ్ స్వయంగా వచ్చి కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.నిజంగా పార్టీలో సమర్థమైన నేతలు లేరా? ఉన్నా వారికి పవన్ కల్యాణ్ అవకాశం ఇవ్వడం లేదా? అన్న చర్చ పవన్ కల్యాణ‌్ అభిమానుల్లోనే విన్పిస్తుంది. ఎంతసేపూ పవన్ కల్యాణ‌్ ఒక్కరే పార్టీని నడపాలన్నా అది సాధ్యం కాదు. ఇతరులపై నమ్మకం లేకనే పవన్ కల్యాణ్ పార్టీలో మరే నేతనూ ఎదగనివ్వడం లేదన్న విమర్శలూ లేకపోలేదు. మొత్తం మీద పవన్ కల్యాణ్ వన్ మ్యాన్ షో చేస్తున్నారు. ఇదే కొనసాగితే పవన్ కల్యాణ్ రాజకీయంగా ఎదగడం అంత సులువు కాదన్నది జనసేనాని గుర్తెరగాలి. సమర్థులైన నాయకులకు బాధ్యతలు అప్పగించినప్పుడే సక్సెస్ కు దారి దొరుకుతుంది