జర్నలిస్ట్ ల స్వేచ్ఛ కు ముప్పు లేదు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జర్నలిస్ట్ ల స్వేచ్ఛ కు ముప్పు లేదు

అమరావతి నవంబర్ 1 (way2newstv.com)
కలానికి సంకెళ్లు...పత్రికా స్వేచ్చకు కళ్లెం అని రెండు  రోజులుగా ఆకర్షణీయమైన హెడ్డింగ్స్ చూస్తున్నాం. కేంద్ర చట్టాల ప్రకారమే పత్రికల నియంత్రణ ఉంటుంది. పత్రికల్లో ఏ వార్త ఎక్కడ రాయాలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నానీ వ్యాఖ్యానించారు. 19 (ఏ) ప్రకారం రాష్ట్రంలో  పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్ట్ ల స్వేచ్ఛ కు వచ్చిన ముప్పు ఏమి లేదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన జీఓ పత్రికా స్వేచ్ఛ కు విఘాతం కాదని అన్నారు. రాజకీయ దురుద్ధేశాలతో ప్రభుత్వం పై నిరాధార వార్తలు రాస్తే సంబంధిత కార్యదర్శి స్పందనను  ప్రచురించాలని జీఓ చెబుతోంది. సంబంధిత శాఖ కార్యదర్శి తన వివరణ ప్రచురించకపోతే న్యాయస్థానంను ఆశ్రయించేందుకు అనుమతించామని అయన అన్నారు. 
జర్నలిస్ట్ ల స్వేచ్ఛ కు  ముప్పు లేదు

రిజాయిన్డెర్ ఇచ్చినా ప్రచురించకపోతే ప్రభుత్వం ఏమి చేయాలి. రాష్ర్టంలోని పత్రికా యాజమాన్యాలు సుప్రీంకోర్టు కన్నా తామే ఉన్నతులన్న భావనలో ఉన్నారని అయన అన్నారు. దేశంలోని  మీడియా వేరు రాష్ట్రంలోని మీడియా వేరు. రాష్ట్రంలోని మీడియాకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా ఉన్నాయి. కొన్ని మీడియా సంస్థలు దురుద్ధేశపూరితంగా వార్తలు రాసి రిజాయిన్డెర్ ఇస్తే వాటిని ప్రచురించకపోతే ఏమి చేయాలి. ప్రజలు మీడియా తీరును గమనించాలి. ఏ మీడియా ఎవరి పక్షాన నిలబడి రాస్తున్నాయో ప్రజలు పరిశీలించాలని అన్నారు.రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ కలానికి సంకెళ్లు కాదు కులానికి సంకెళ్లు అనే భావనలో పత్రికాధిపతులు ఉన్నారు. ఏళ్ల కాలం తమ కులమే రాజ్యం చేయాలనే భవనలో మీడియా యజమానులు చూస్తున్నారు. ఎలక్ట్రిక్  బస్సుల కొనుగోలులో అప్పటి ఎండి సురేంద్రబాబు సహకరించలేదని ప్రభుత్వం బదిలీ చేసారని తప్పుడు వార్త రాసారు. తప్పుడు వార్తపై రవాణా శాఖ కార్యదర్శి, సురేంద్ర బాబులు రిజాయిన్డెర్ ఇచ్చినా ప్రచురించి లేదని అన్నారు. తప్పుడు వార్తలు కావాలని రాస్తే కోర్ట్ లకు వెళ్ళమని సంబంధిత శాఖ కార్యదర్శలకు అనుమతించాం. కాలానికి సంకెళ్లు కాదు కులానికి...తప్పుడు వార్తలు రాసే వారికి సంకెళ్లని మంత్రి అన్నారు. నీతి నిజాయితీ ఉన్న పత్రికలు.. జర్నలిస్ట్ లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మా కులమే ఉండాలి... చంద్రబాబు శాశ్వత సీఎంగా ఉండాలనే వారికే సంకెళ్లు. ప్రజలు, తక్కిన మీడియా అధిపతులు వాస్తవాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు.