డిసెంబర్ 11న అల వైకుంఠపురంలో టీజర్ !!! - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

డిసెంబర్ 11న అల వైకుంఠపురంలో టీజర్ !!!

'జులాయి', 'సన్నాఫ్‌ సత్యమూర్తి' చిత్రాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం 'అల.. వైకుంఠపురంలో..' . ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర సాంగ్స్ పాపులర్ అయ్యాయి. అల్లు అర్జున్ 19వ చిత్రంగా తెరకెక్కుతున్న  ఈ సినిమాలో ఆయనకు  జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు. అభిమానులు, సినీ జనాలు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న‘అల వైకుంఠపురంలో’ టీజర్ డిసెంబర్ 11న విడుదల కానుంది.
డిసెంబర్ 11న అల వైకుంఠపురంలో టీజర్ !!!

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు 'గీతా ఆర్ట్స్' 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోంది.
నటీనటులు : సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, పమ్మి సాయి నటిస్తున్నారు.