2019 సంవత్సరం లో అవినీతిలో రెవెన్యూ శాఖ టాప్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

2019 సంవత్సరం లో అవినీతిలో రెవెన్యూ శాఖ టాప్

హైదరాబాద్‌ డిసెంబర్ 28(way2newstv.com):
 2019 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోదక శాఖ విడుదల చేసింది. ఈ సంవత్సరం మొత్తం 173 కేసులు నమోదయ్యాయి. 2018వ సంవత్సరంలో 139 కేసులు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 44 కేసులు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోదక శాఖ నమోదు చేసిన కేసుల్లో రెవెన్యూ శాఖ మొదటి స్థానంలో ఉంది. 
2019 సంవత్సరం లో అవినీతిలో రెవెన్యూ శాఖ టాప్

రెవెన్యూ శాఖకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 54 కేసులు నమోదయ్యాయి. పురపాలక శాఖ 25, పోలీస్‌ శాఖకు సంబంధించి 18 కేసులు నమోదయ్యాయి. వైద్య ఆరోగ్యశాఖ 13 కేసులు, విద్యుత్‌ శాఖ 12 కేసులు, పంచాయతీరాజ్‌ శాఖకు సంబంధించి 10 కేసులు నమోదయ్యాయి. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే కింది లింక్ ద్వారా సమాచారం అందించాలని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేశారు