శీతాకాల విడిది కోసం ప్రత్యేక ఏర్పాట్లు.
హైదరాబాద్ డిసెంబర్ 16 (way2newstv.com)
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు రానున్నారు. ఈ నెల 21వ తేదీన బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ రానున్నారు. అధ్యక్షుడి రాష్ట్ర పర్యటనపై రాష్ట్రపతి భవన్ నుంచి సమాచారం అందుకున్న సిటీపోలీసులు.. పటిష్ట ఏర్పాట్లు చేశారు. అన్ని శాఖలూ అప్రమత్తమయ్యాయి. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆయన విడిది చేసే బొల్లారం రాష్ట్రపతినిలయాన్ని కేంద్ర భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఈనెల 21న హైదరాబాద్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్..
రాష్ట్రపతి పర్యటన నిమిత్తం తీసుకోవాల్సిన చర్యలపైనా, బందోబస్తు ఏర్పాట్లపైనా సీఎస్ ఆరా తీశారు. ఇదిలా ఉంటే రాష్ట్రపతి ఈనెల 28వ తేదీ వరకు ఆయన సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేస్తారు. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు.