ఏపీలో 25 జిల్లాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీలో 25 జిల్లాలు

విశాఖపట్నం డిసెంబర్ 21 (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్లో 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. విశాఖలోని వైకాపా ప్రధాన కార్యాలయంలో జగన్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. అన్ని జిల్లాలు అభివృద్ధి కావాలనే ఉద్దేశంతోనే 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చామని చెప్పారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలనుకోవడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు.
ఏపీలో 25 జిల్లాలు

రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలో 3 రాజధానులు వస్తున్నాయని మంత్రి అవంతి శ్రీనివాసరావు పేర్కొన్నారు. తెదేపా హయాంలో ఐదేళ్లలో జరగని అభివృద్ధిని 5 నెలల్లో జగన్ చేసి చూపించారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైకాపా జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.