సెల్ఫ్‌ హెల్ప్ గ్రూపుల మొత్తాన్ని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలి: హరీశ్‌రావు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సెల్ఫ్‌ హెల్ప్ గ్రూపుల మొత్తాన్ని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలి: హరీశ్‌రావు

సిద్ధిపేట డిసెంబర్ 19 (way2newstv.com)
: మంత్రి హరీశ్‌రావు జిల్లాలోని బెజ్జంకి మండలంలో పర్యటించారు.  ఢిల్లీ పర్యటనలో భాగంగా జీఎస్టీ సమావేశానికి సంబంధించిన వివరాలను మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... నిన్న ఢిల్లీలో రాష్ర్టాల ఆర్థిక మంత్రుల సమావేశంలో ఆర్థిక మాంద్యం, ఆర్థిక క్రమశిక్షణపైనే చర్చ జరిగింది. 
సెల్ఫ్‌ హెల్ప్ గ్రూపుల మొత్తాన్ని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలి: హరీశ్‌రావు

వడ్డీలేని రుణాలు దేశంలో కొన్ని జిల్లాలకే ఇస్తున్నారు.అన్ని జిల్లాలకు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరాను. దేశంలోని అన్ని సెల్ఫ్‌హెల్ప్ గ్రూపులకు ఇవ్వాలని కోరాను. దేశ మహిళలు అందరూ ఆర్థిక స్వావలంబన సాధిస్తారని చెప్పా. సెల్ఫ్‌హెల్ప్ గ్రూపులకు ఇచ్చే మొత్తాన్ని రూ. మూడు లక్షల నుంచి రూ. ఐదు లక్షలకు పెంచాలని కోరాను. అన్ని రాష్ర్టాల మంత్రులు కలిసి ప్రతిపాధించాలని నిర్మలాసీతారామన్ సూచించారు.