డిసెంబర్‌ 31 వరకు అన్ని జిల్లాలో చెక్‌ పోస్టులు పూర్తిచేయాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

డిసెంబర్‌ 31 వరకు అన్ని జిల్లాలో చెక్‌ పోస్టులు పూర్తిచేయాలి

అమరావతి డిసెంబర్ 26  (way2newstv.com)
అమరావతి: రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా డిసెంబర్‌ 31 వరకు అన్ని జిల్లాలో చెక్‌ పోస్టులు పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభించాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. ఆయా జిల్లాల్లో చెక్‌పోస్టుల పనితీరును క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా వ్యక్తిగతంగా పర్యటించాలని ప్రభుత్వం కలెక్టర్లకు స్పష్టం చేసింది. 
డిసెంబర్‌ 31 వరకు అన్ని జిల్లాలో చెక్‌ పోస్టులు పూర్తిచేయాలి

దీంతోపాటు గనులు, పంచాయతీరాజ్, పోలీసు శాఖలకు అవసరమైన సహకారాన్ని అందించాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశించింది. ఇసుక అక్రమ రవాణా, మద్యం అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు చెక్‌పోస్టుల ఏర్పాటుకు గతంలోనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రతి చెక్‌పోస్టు వద్ద సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే.