హైద్రాబాద్, డిసెంబర్ 30, (way2newstv.com)
ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఆన్‌లైన్ రైల్వే టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ఐఆర్‌సీటీసీ ట్రైన్ ప్యాసిజర్లకు వివిధ రకాల సేవలు అందిస్తోంది. రైల్వే టికెట్ బుకింగ్‌తోపాటు టూరిజం సర్వీసులు కూడా ఆఫర్ చేస్తోంది. ట్రైన్‌తోపాటు ఫ్లైట్ టూర్లను అందిస్తోంది. ఐఆర్‌టీసీసీ తక్కువ ధరలో అందిస్తున్న టూర్ ప్యాకేజీల్లో హైదరాబాద్ టూర్ ప్యాకేజ్ కూడా ఒకటి.హైదరాబాద్ సిటీకి ఎంతో ఘన చరిత్ర ఉంది. చూడటానికి ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. చారిత్రక కట్టడాలు, పార్కులు సహా పలు ప్రాంతాలను సందర్శించొచ్చు. అందుకే ఐఆర్‌సీటీసీ కూడా హెరిటేజ్ హైదరాబాద్ పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది.
800 రూపాయలకే హైద్రాబాద్ సిటీ టూర్
దీని ధర రూర.805 నుంచి ప్రారంభమౌతోంది.ఐఆర్‌సీటీసీ హైదరాబాద్ టూర్ ఒక్క రోజే ఉంటుంది. అది కూడా బస్సులో జర్నీ చేయాలి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి ఈ టూర్ ప్రారంభమౌతోంది. శుక్రవారం మినహా మిగతా అన్ని రోజుల్లోనూ ఈ టూర్ అందుబాటులో ఉంటుంది.ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లకు వచ్చే ట్రైన్లలోని ప్యాసింజర్లకు ఈ టూర్ కరెక్ట్‌గా సరిపోతుంది. మిగత ట్రైన్లకు వచ్చేవారు కూడా ఈ టూర్‌లో పాల్గొనవచ్చు. అలాగే ఇతరులు కూడా టూర్ ప్యాకేజ్ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు.ఇకపోతే టూర్‌లో భాగంగా ట్యాంక్ బండ్, బిర్లా మందిర్, సాలార్‌జంగ్ మ్యూజియం, మక్కా మసీద్, చార్మినార్, గోల్కోండ, కుతుబ్ షాహి టూంబ్స్, చౌహోమొల్లా ప్యాలెస్ వంటి ప్రదేశాలను చూడొచ్చు. కాచిగూడ, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి టూర్ ప్రారంభమౌతుంది. ఈ టూర్‌లో ఎలాంటి ఫుడ్, ఇతర సర్వీసులు ఉండవు. టూరిస్ట్‌లే వారి భోజన, ఇతర ఖర్చులను భరించాల్సి ఉంటుంది