కిక్కు ఎక్కని 90 ఎంఎల్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కిక్కు ఎక్కని 90 ఎంఎల్

హైద్రాబాద్, డిసెంబర్ 7  (way2newstv.com)
ఈ సినిమా ట్రైలర్ రొటీన్‌గానే అనిపించినా కూడా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అనేలా ఉండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. చివరి నిమిషంలో ఒకరోజు వాయిదా పడి ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాంకొన్ని సినిమాలు చాలా రొటీన్ ఉంటాయి. కాకపోతే ఏదో ఒక కొత్త పాయింట్ మీద కమర్షియల్ అంశాలు మిక్స్ చేసుకుని వాటిని తెరకెక్కిస్తుంటారు ఆయా సినిమాల డైరెక్టర్స్. ఆ కోవకి చెందిన సినిమానే 90 ఎంఎల్. కార్తికేయ హీరోగా నటించిన ఈ సినిమా ట్రైలర్ తోనే ఆ విషయం కన్వే అయ్యింది. మరి మాస్ మసాలా కమర్షియల్ పాయింట్‌తో వచ్చిన ఈ సినిమా పేరుకి తగ్గట్టే కిక్ ఇచ్చిందా?, లేక బోర్ కొట్టించిందా అనేది ఇప్పుడు చూద్దాం.
కిక్కు ఎక్కని 90 ఎంఎల్

దేవదాసు (కార్తికేయ) పుట్టడమే ఫేటల్ ఆల్కహాలిక్ డిజస్దర్‌తో పుడతాడు.అయితే అతను ఆల్కహాల్‌కి రియాక్ట్ అవుతుండడంతో డాక్టర్ అతనికి రోజు ఆల్కహాల్ తాగించమని ఆధరైజ్డ్ డ్రింకర్ సర్టిఫికెట్ ఇస్తాడు. అలా పెరిగి పెద్దవాడయిన దేవదాసుకి రోజుకి మూడు పూటలా కూడా 90 ఎంఎల్ తాగాల్సి ఉంటుంది. ఒక వేళ అలా తాగకపోతే అతని ప్రాణాలకే ప్రమాదం. అలాంటి అతను సువాసన(నేహా సోలంకి)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. కానీ సువాసనకి, ఆమె ఫ్యామిలీకి మాత్రం అసలు అలాంటి అలవాట్లు ఉన్నవాళ్లు నచ్చరు. కానీ దేవదాసు రోజు 90 ఎంఎల్ తాగుతాడు అనే విషయం తెలియక అతనితో ప్రేమలో పడుతుంది. కానీ ఒక సంఘటనలో ఆ విషయం తెలుస్తుంది. దాంతో ఆమె అతనికి బ్రేకప్ చెబుతుంది.అదే టైమ్‌లో దేవదాసు అంతకుముందు కొట్టిన విలన్స్ కూడా అతని ప్రేమకు అడ్డుపడుతూ ఉంటారు. దేవదాసు వాళ్ళ అడ్డు తొలగించుకుని ఎలా సువాసన ప్రేమని గెలుచుకున్నాడు అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.ఈ సినిమా ట్రైలర్ లోనే సినిమా కథ మొత్తం చెప్పేసాడు డైరెక్టర్. 90ఎంఎల్ అనే కొత్త పాయింట్‌ని జోడించి తెరకెక్కించిన రొటీన్ సినిమా ఇది అని సినిమాలో ఉన్న కంటెంట్ ఏంటి అనేది ముందే క్లియర్‌గా చూపించారు. ఫస్ట్ టైమ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన శేఖర్ రెడ్డి ఎర్రా కమర్షియల్ ఫార్మాట్‌ని బాగా వంటబట్టించుకున్న డైరెక్టర్ అని సినిమా మొదలయిన కాసేపటికే అర్ధమవుతుంది. ఫార్మాట్ ప్రకారం ఒక పాట, ఒక ఫైట్, ఒక లవ్ సీన్ ఇలా నడిచింది సినిమా. సినిమాలో పెద్దగా కొత్తదనం లేకపోయినా కూడా ఉన్న కంటెంట్‌లో ఎంటర్టైన్మెంట్ జోడించి బాగానే సినిమాని నడిపించాడు.ఇంటర్వెల్ వరకు కిక్ ఇస్తూ బ్రేక్స్ లేకుండానే స్మూత్ రైడ్‌లా అనిపించింది. హీరో, హీరోయిన్ బ్రేకప్ అని తెలిసిన పాయింట్‌తోనే ఇంటర్వెల్ కార్డు వేసిన డైరెక్టర్, ఆ తరువాత మాత్రం ఎందుకో తడబడ్డాడు. సెకండ్ హాఫ్‌లో హీరోయిన్ హీరోని మార్చడానికి, మందు మాన్పించడానికి చేసిన ప్రయత్నాలు లాంటివి అన్నీ కూడా తేలిపోయాయి. తనకు ఉన్న డిసీజ్ గురించి చెబితే సరిపోయే దానికి ఇంత సినిమా నడిపించాల్సిన అవసరం ఏంటి అనిపిస్తుంది సినిమా చూసేవాళ్ళకి. పోనీ ఆ విషయం చెప్పడకుండా ఉండడానికి బలమయిన కారణం ఏమైనా ఉందా అంటే అదీ లేదు.ఫస్టాఫ్‌లో బాగా పండిన కామెడీ కూడా సెకండాఫ్‌కి వచ్చేసరికి పలచబడి పోయింది. దాంతో కిక్ పూర్తిగా తగ్గిపోయింది. ఇక మెయిన్ విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన రవి కిషన్ వెరైటీ గెటప్‌తో అసలు అతను విలనా? లేక కమెడియనా అనే విషయం కూడా అర్ధం కానీ పరిస్థితి ఏర్పడింది? ఉన్నంతలో అతనితోనే కామెడీ పండిస్తూ బండినడిపించాడు డైరెక్టర్. కానీ ఎండ్‌కి వచ్చేసరికి ఆ కామెడీ కూడా చాలా చీప్‌గా అనిపించింది. కావాలని సినిమాని ఎండ్ చెయ్యడానికి ఎదో అటు ఇటు తిప్పినట్టు ఉంది సిట్యుయేషన్. ఇక క్లయిమాక్స్ కూడా కొత్తగా ఏమీ లేదు. హీరోయిన్ వచ్చి హీరోకి ఒక లిప్ లాక్ ఇవ్వగానే అతను లేచి విలన్స్‌ని బంతాడేసి తన ప్రేమని గెలుచుకుంటాడు.ఈ సినిమాని కార్తికేయ అటెంప్ట్ చెయ్యడానికి కారణం ఆ సినిమాలో హీరో క్యారెక్టర్‌లో ఉన్న మసీ నెస్ అండ్ కిక్. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో తన నటనను మెరుగుపరుచుకున్నాడు కార్తికేయ. కామెడీ టైమింగ్ పర్లేదు అనిపించింది. ఇక కొత్త హీరోయిన్ నేహా సోలంకి ఉన్నంతలో బాగానే చేసింది. ఆమెది కాస్త పాసివ్ క్యారెక్టర్ కావడంతో పెద్దగా నటించాల్సిన అవసరంలేదు. పాడింగ్ ఆర్టిస్టులు అంతా కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యారు. రోలర్స్ రఘు కామెడీ బాగానే పేలింది. ఇక ఇప్పటివరకు రాప్ సింగర్‌గా ఉన్న రోల్ రైడా ఈ సినిమాలో హీరో పక్కనే ఉండి కామెడీ పండించే పాత్రలో బాగానే ఇమిడిపోయాడు.కొత్త డైరెక్టర్ శేఖర్ రెడ్డి సినిమా ఫస్టాఫ్ అంతా కూడా కమర్షియల్ పాయింట్స్‌ని డీల్ చెయ్యడంపై తనకు ఉన్న పట్టు చూపించాడు. ఇక ఫైట్స్ అండ్ సాంగ్స్ విషయంలో కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మాస్టర్స్ దొరకడంతో అవి కూడా చాలా నీట్‌గా కుదిరాయి. అనూప్ సినిమా ఫస్టాఫ్‌లో ఇచ్చిన మూడు పాటలు బావున్నాయి. కానీ సెకండాఫ్ సాంగ్స్ మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అలరించింది. సన్నివేశాల్లోని విజువల్ కంటెంట్‌ని బాగా ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించని ఫారెన్ పాటలు మళ్ళీ ఈ సినిమాలో రెండు కనిపించాయి.ఓవరాల్‌గా చూస్తే ఒక మంచి కమర్షియల్ సినిమా చూడాలి అని కోరుకునేవాళ్ళకి నచ్చేలా ఉంది 90ఎంఎల్. అయితే సెకండాఫ్ కూడా ఫస్టాఫ్ ఉన్నట్టు ఉండుంటే మాత్రం కార్తికేయ హిట్ కొట్టాడు అని కాన్ఫిడెంట్‌గా చెప్పడానికి ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం విజయానికి ఒక మెట్టు దూరంలోనే నిలిచిపోయాడు అనిపిస్తుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుంది ఈ వారాంతం గడిచేవరకు చెప్పడం కష్టమే.