రాయపాటి సైలెంట్ వెనుక - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రాయపాటి సైలెంట్ వెనుక

గుంటూరు, డిసెంబర్ 31, (way2newstv.com
గుంటూరు జిల్లా రాజ‌కీయాల్లో కీల‌క‌మైన నాయ‌కుడిగా, వివాద ర‌హితుడిగా… గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు కూడా త‌న‌కు ప్రత్యేక‌త‌ను సంత‌రించుకున్న మాజీ ఎంపీ, సీనియ‌ర్ నాయ‌కుడు రాయ‌పాటి సాంబ‌శివ‌రావు.. ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారా? త‌న కోసం కాక‌పోయినా.. త‌న కుమారుడు రాయ‌పాటి రంగారావు భ‌విష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయ‌న కీల‌క ఆలోచ‌న చేస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు రాయ‌పాటి అనుచరులు. ఈ ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన ఆయ‌న ఓట‌మి చ‌విచూశారు. అయితే, ఎన్నిక‌ల‌కు ముందు త‌న‌కు టికెట్ విష‌యంలో జ‌రిగిన ప‌రాభ‌వాన్ని రాయ‌పాటి సాంబశివరావు ఇంకా మ‌రిచిపోలేద‌ని అంటున్నారు స్థానికులు.రాయ‌పాటి సాంబశివరావు బెదిరింపుల‌ నేప‌థ్యంలోనే చంద్రబాబు ఆయ‌న‌కు ఈ ఏడాది న‌ర‌స‌రావుపేట ఎంపీ టికెట్ ఇచ్చారు. 
రాయపాటి సైలెంట్ వెనుక

ఇక‌, అప్పటికే వైసీపీ దూకుడు పెంచింది. ఇక్కడ నుంచి యువ‌నేత, విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు శ్రీకృష్ణదేవ‌రాయులును రంగంలోకి దింపింది. ఏ మాత్రం రాజ‌కీయ అనుభవం లేని యువ‌కుడి చేతిలో రాయ‌పాటి ఘోరంగా ఓడిపోయారు. త‌న‌కు ముందుగానే టికెట్ క‌న్ఫర్మ్ చేసి ఉంటే.. ప‌రిస్థితి ఇలా ఉండేదికాద‌న్నది రాయ‌పాటి వ‌ర్గం ఆలోచ‌న‌. ఏదేమైనా ఈ ప‌రాభ‌వం నేప‌థ్యంలోనే అప్పటి నుంచి ఇప్పటి వ‌ర‌కు చంద్రబాబుతోనూ రాయ‌పాటి డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నారు.అయితే, త‌న కుమారుడు రంగారావును రాజ‌కీయంగా వార‌సుడిగా ప్రక‌టించిన రాయ‌పాటి సాంబశివరావు త‌మ‌కు స‌త్తెన‌ప‌ల్లి సీటును కేటాయించాల‌ని చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందే త‌న కుమారుడికి స‌త్తెన‌ప‌ల్లి ఇవ్వాల‌ని రాయ‌పాటి నానా ర‌భ‌స ర‌భ‌స చేశారు. ఇక ఇప్పుడు కోడెల కూడా లేక‌పోవ‌డంతో ఇప్పట‌కీ అయినా త‌న కుమారుడు రంగారావుకు ఇన్ ఛార్జి పదవి ఇవ్వాల‌ని రాయ‌పాటి కోరుతున్నారు. అయితే, ఇప్పటి వ‌ర‌కు కూడా చంద్రబాబు ఎలాంటి నిర్ణయ‌మూ తీసుకోలేదు. ఈ నేప‌థ్యంలో రాయ‌పాటి సాంబశివరావు వ‌ర్గం వైసీపీ వైపు చూస్తోంది. టికెట్ స‌హా ఎలాంటి బేష‌రతులు లేకుండా పార్టీలో మారేందుకు రెడీ అయి నట్టు స‌మాచారం.దీనికి మ‌రో ప్రధాన రీజ‌న్ కూడా క‌నిపిస్తోంది. ఇప్పట్లో టీడీపీ పుంజుకునే ప‌రిస్థితి లేక‌పోవ‌డం, ఉన్న నాయ‌కుల్లో క‌లివిడి కొర‌వ‌డ‌డం, పార్టీలో ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌కు ఎలాంటి ప్రాధాన్యం లేక పోవ‌డం వంటి కార‌ణాలు, చంద్రబాబు త‌ర్వాత పార్టీని న‌డిపించే వారిపై క్లారిటీ కూడా లేక పోవ‌డం నేప‌థ్యంలో వైసీపీ అయితేనే బెట‌ర‌నే వ్యాఖ్యలకు రాయ‌పాటి సాంబశివరావు క‌ట్టుబ‌డుతున్నట్టు చెబుతున్నారు. అస‌లు ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీ నుంచి రాయ‌పాటి రంగ‌బాబుకు ఎమ్మెల్యే టిక్కెట్ ఆఫ‌ర్ వ‌చ్చినా చివర్లో బాబు బుజ్జగింపుల‌తో సైలెంట్ అయ్యారు. మ‌రో రెండు మూడు నెల‌ల అనంతరం లేదా స్థానిక సంస్థల ఎన్నిక‌ల త‌ర్వాత ఆయ‌న నిర్ణయం తీసుకుంటార‌ని తెలుస్తోంది. మ‌రి బాబు రాయపాటిని ఆపే ప్రయ‌త్నం చేస్తారో.. లేదో చూడాలి.