కర్నూలులో మళ్లీ కోట్ల పట్టు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కర్నూలులో మళ్లీ కోట్ల పట్టు

కర్నూలు, డిసెంబర్ 9, (way2newstv.com)
క‌ర్నూలు టీడీపీ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్తరంగా మారాయి. ఇక్కడ నుంచి అనేక మంది సీనియ‌ర్లు టీడీపీ త‌ర‌ఫున ఉన్నారు. అయితే, వీరిలో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి త‌న‌దైన శైలిలో రాజ‌కీయాల‌కు తెర‌దీశార‌నే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి మార్కు రాజ‌కీయాల‌పైనే చ‌ర్చ న‌డుస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. కాంగ్రెస్‌లో సుదీర్ఘ కాలం కొన‌సాగిన కోట్ల కుటుంబం ఈ ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ తీర్థం పుచ్చుకుని సూర్యప్రకాశ్‌రెడ్డి, ఆయ‌న స‌తీమ‌ణి సుజాత‌మ్మ ఎన్నిక‌ల్లోపోటీ చేశారు. వీరి సొంత నియోజ‌క‌వ‌ర్గం కోడుమూరు. అయితే అది ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఈ ఏడాది ఎన్నిక‌ల్లో సుజాత‌మ్మకు చంద్రబాబు ఆలూరు టికెట్ ఇచ్చారు.స‌రే. ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీ ముందు త‌ల‌పండిన నాయ‌కులు సైతం ఓడిపోయారు. 
కర్నూలులో మళ్లీ కోట్ల పట్టు

ఈ క్రమంలోనే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఫ్యామిలీ కూడా ఓట‌మి పాలైంది. అయితే, ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఇప్పుడు త‌న‌దైన శైలిలో విజృంభించి ఇక్కడ ప‌ట్టు పెంచుకునేందుకు రెడీ అయ్యారు. ఈ ఎన్నిక‌ల్లో జిల్లాలో టీడీపీ 14 ఎమ్మెల్యే సీట్లతో పాటు క‌ర్నూలు, నంద్యాల ఎంపీ సీట్లలో ఘోరంగా ఓడిపోయింది. దీంతో కేఈ లాంటి సీనియ‌ర్ నేత‌లే రాజ‌కీయంగా యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు క‌ర్నూలు జిల్లాలోని నియోజ‌క‌వ‌ర్గాల స‌మీక్ష స‌మావేశం నిర్వహించారు.మొత్తం మూడు రోజుల ప‌ర్యట‌న‌లో ఆయ‌న జిల్లా వ్యాప్తంగా నాయ‌కుల‌ను క‌లిశారు. ఓట‌మి, ప్రస్తుత ప‌రిస్థితిపై చ‌ర్చించారు. ఈ క్రమంలోనే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గం స‌హా ఇటీవ‌ల త‌న స‌తీమ‌ణి ఓడిపోయిన ఆలూరులోనూ ప‌ట్టు పెంచుకునేందుకు సిద్దమ‌య్యారు. మంగ‌ళ‌వారం కోడుమూరు నియోజ‌వ‌క‌ర్గం స‌హా ఆలూరు నియోజ‌క‌వ‌ర్గం స‌మీక్ష స‌మావేశాలు జ‌ర‌గాల్సి ఉంది. అయితే, ఇక్కడ కోడుమూరు ఇంచార్జ్‌గా ఉన్న విష్ణువ‌ర్దన్‌రెడ్డికి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి మ‌ధ్య గ్యాప్ ఉంది. దీంతో ఈయ‌న‌ను పక్కకు నెట్టేయాలని కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఎప్పటి నుంచో చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అందివ‌చ్చిన అవ‌కాశాన్ని ఆయ‌న స‌ద్వినియోగం చేసుకున్నారు.కోడుమూరు నియోజకవర్గ సమీక్షా సమావేశం క్యాన్సిల్ అయ్యిందని జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో ప్రక‌టించారు. దీంతో అప్పటి వ‌ర‌కు ఈ స‌మావేశం కోసం వేచి ఉన్న ఇంచార్జి విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు వెళ్ళిపోయారు. అయితే, ఆవెంట‌నే రంగంలోకి దిగిన కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి త‌న వ్యతిరేకవ‌ర్గం అక్క‌ నుంచి వెళ్లిపోయిన వెంట‌నే కోడుమూరు, ఆలూరు రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కు క‌లిసి స‌మీక్షా స‌మావేశం పెట్టారు. నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిస్థితుల‌పై చ‌ర్చించారు. ఎలా ముందుకు వెళ్తే.. పార్టీ బ‌ల‌ప‌డుతుందో నిర్ణయించుకున్నారు. దీంతో ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి భారీ ఎత్తున ప్రతినిధులు వ‌చ్చి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి పాల్గొన్న స‌మావేశాన్ని విజ‌యవంతం చేశారు. ఈ ప‌రిణామంతో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి త‌న‌మార్కు రాజ‌కీయాల‌కు తెర‌దీశార‌ని జిల్లాపై ప‌ట్టును పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నార‌ని చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి ఇది భ‌విష్యత్తులో ఎలాంటి ? ప‌రిణామాల‌కు దారి తీస్తుందో ? చూడాలి.