హైదరాబాద్ డిసెంబర్ 10, (way2newstv.com):
తెలంగాణ హైకోర్టు లో మంగళవారం దిశ కేసు ఎన్ కౌంటర్ పై మరో పిటీషన్ దాఖలయింది. పౌర హక్కుల సంఘము అధ్యక్షుడు లక్ష్మణ్ ఈ పిటీషన్ దాఖలు చేసారు. పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్ బూటకపు ఎన్ కౌంటర్ అని దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని పిటిషన్ లో పేర్కోన్నారు.
దిశ కేసు ఎన్ కౌంటర్ పై మరో పిటిషన్
ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసుల పై 302 ఐపీసీ కేసులు నమోదు చేయాలని పిటీషనర్ కోరారు. నాలుగు మృతదేహాలను వెంటనే కుటుంబ సభ్యులకు అప్పగించాలని కోరారు. పిటీషన్ లో తెలంగాణ ప్రభుత్వం, సైబరాబాద్ సీపీ సజ్జన్నార్, సిట్ కమిషనర్ మహేష్ భగవత్, షాద్ నగర్,శంషాబాద్, ఎస్ హెచ్ ఓ లతో కలిపి మొత్తం 9 మంది ప్రతివాదులుగా చేర్చారు. పిటీషన్ ను అన్ని పిటీషన్ లతో కలిపి గురువారం విచారిస్తామని హైకోర్టు ప్రకటించింది.