కంటి వెలుగు విజయవంతం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కంటి వెలుగు విజయవంతం

కర్నూలు, డిసెంబర్ 27  (way2newstv.com)
డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షల్లో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో ఉండడం చాలా సంతోషంగా ఉందని, కంటి వెలుగు కార్యక్రమంలో బాగా కష్ట పడ్డ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అధికారులును అభినందిస్తున్నట్లు కర్నూలు కలెక్టర్ జి వీరపాండియన్ తెలిపారు. శుక్రవారం కల్లూరు మండలం శరీన్ ఉన్నత పాఠశాలలో డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఉచిత కంటి అద్దాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమంలో కలెక్టర్ వీరపాండియన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ విదేకరే, జాయింట్ కలెక్టర్ 2 సయ్యద్ ఖాజా మొహిదీన్, డిఈవో సాయిరాం, డీఎంహెచ్ఓ నరసింహులు జ్యోతి ప్రజల్వన చేశారు. 
కంటి వెలుగు విజయవంతం

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కంటి అద్దాలు పంపిణీ కార్యక్రమంలో విద్యార్థి ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి స్క్రీనింగ్ చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని అందులో భాగంగా కర్నూలు జిల్లాలో 30 టీములు ఏర్పడి 4351 ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో 673728 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. కంటి లోపంతో 37329 మంది విద్యార్థులు బాధ పడుతున్నారన్నారు. స్క్రీనింగ్ పరీక్షల్లో 99.96 శాతం ఉందన్నారు. 14089 మంది విద్యార్థులకు కళ్ళజోడు ఇవ్వాలని డాకర్లు రిఫర్ చేశారని వారి అందరికీ ఉచితంగా ప్రభుత్వం కంటి అద్దాలు పంపిణీ చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 2020 లో ప్రతి ఊరు లో ఉన్న ప్రతి మనిషికి కంటి పరీక్షలు నిర్వహించాడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కల్లూరు మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రహరీ గోడలు మంజూరు చేయాలని పాణ్యం యమ యల్ ఏ కోరారని, ప్రహరీ గోడలు మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం కలెక్టర్ కంటి అద్దాలు బాక్స్ లను ఓపెన్ చేసి, విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేసి, అద్దాలు బాగా ఉన్నాయి అని జిల్లా కలెక్టర్ విద్యార్థులను అడిగారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ వైయస్ ఆర్ కంటి వెలుగు కార్యక్రమంలో రాష్ట్రంలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉండడం జిల్లా కలెక్టర్ ను అభినందిస్తుమన్నారు. విద్యార్థులుకు దృష్టిలోపం ఉండకుండాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డాక్టర్ వైయస్ ఆర్ కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించరన్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా వ్యాయమం చేయాలన్నారు. మన బడి నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో 9 రకాల సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుమన్నారు. ఈ కార్యక్రమంలో కల్లూరు యమ్ ఆర్ ఓ రవి, విద్యా, వైద్య శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.