కేసీఆర్ పై సోషల్ మీడియాలో పొగడ్తలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కేసీఆర్ పై సోషల్ మీడియాలో పొగడ్తలు

హైద్రాబాద్, డిసెంబర్ 6 (way2newstv.com)
కేసీఆర్... ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. సోషల్ మీడియాలో దిశ నిందితుల ఎన్ కౌంటర్ కు సంబందించిన వార్తలే కనిపిస్తున్నాయి. ఎన్ కౌంటర్ ఏ పరిస్థితుల్లో, ఎలా జరిగినా, కేసీఆర్ నుంచి అందిన ఆదేశాల మేరకే నిందితులపై పోలీసులు మట్టుబెట్టారని, తద్వారా ఓ స్పష్టమైన సంకేతాన్ని రేపిస్టులకు పంపించారని కామెంట్లు వస్తున్నాయి. కేసీఆర్ ను పొగడుతూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి రాష్ట్రంలోనూ కేసీఆర్ వంటి నేత, సజ్జన్నార్ వంటి పోలీసు అధికారి తప్పనిసరిగా ఉండాలని నెటిజన్లు అంటున్నారు.
కేసీఆర్ పై సోషల్ మీడియాలో పొగడ్తలు

"మీ ప్రభుత్వానికి ఓ నమస్కారం. ఇటువంటి ప్రభుత్వాన్నే మేము కోరుకుంటున్నాం" అని, "తెలంగాణ పోలీసులకు బిగ్ సెల్యూట్" అని, "బాలీవుడ్ స్టయిల్ లో పోలీసులు తమ సత్తా చాటారు" అని, "కేసీఆర్ కు జయహో" అని పలు రకాల కామెంట్లు కనిపిస్తున్నాయి. "వారు పోలీసుల కస్టడీలో ఉండి తప్పించుకున్నారా? ఎలా జరిగిందో నమ్మశక్యం కావడం లేదు. అయినా, ఎన్ కౌంటర్ ను సమర్ధిస్తున్నాను. దిశకు న్యాయం జరిగింది" అని ఒకరు, "ఇటువంటి నిర్ణయాలనే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ తీసుకుంటుంటే అత్యాచారాలన్న మాటే వినపడదు" అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ట్విట్టర్ లో ఎన్ కౌంటర్ కు సంబందించిన వార్తలు, దిశ హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్ లోకి వెళ్లిపోయింది.