గజ్వేల్ పర్యటనకు కేసీఆర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గజ్వేల్ పర్యటనకు కేసీఆర్

మెదక్, డిసెంబర్ 10, (way2newstv.com)
ములుగు ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని, గజ్వేల్ సమీకృత మార్కెట్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సందర్శించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్దసారధి, ఉద్యానశాఖ కమీషనర్ వెంకట్రాంరెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... ములుగు ఉద్యాన విశ్వవిద్యాలయంతో నూతన అధ్యాయం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశలకు, ఆశయానికి అనుగుణంగా యూనివర్సిటీ రూపుదిద్దుకుంది.తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక వరంలాంటిది. దేశంలో ఇది నాలుగో ఉద్యాన విశ్వవిద్యాలయం. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ వ్యవసాయ రంగంలో సమూల మార్పుకు ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రారంభంతో శ్రీకారం చుట్టనున్నారు. 
గజ్వేల్ పర్యటనకు కేసీఆర్

హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుల తరువాత తెలంగాణలోనే విశ్వవిద్యాలయం ఉంది.53.25 ఎకరాలలో నూతన ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. అందులో 30.01 ఎకరాలలో పలు రకాల పండ్ల మొక్కలు నాటిన సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్, మామిడి, జామ, దానిమ్మ, పపయా, చింత, ఉసిరి తదితర 49 రకాల వెరైటీల పండ్ల మొక్కలు శాండల్, బంబూ ప్లాంట్స్ పెంచారు.రెండేండ్లుగా ఉద్యాన విశ్వవిద్యాలయం రూపుదిద్దుకునేందుకు కృషి చేసిన అధికారులకు అభినందనలు, రాష్ట్ర రైతాంగానికి శుభాకాంక్షలు.ఉద్యానరంగంలో శాస్త్ర, సాంకేతికతను పెంపొందించేందుకు ముందడుగు పడనుంది. రాష్ట్రంలోని రైతుల ఆర్థికాభివృద్ధికి, సాంకేతిక శిక్షణకు తోడ్పడుతుంది. రైతు ఆత్మగౌరవంతో బతకాలి, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం తపిస్తుంటారు. విశ్వవిద్యాలయానికి జాతీయ, అంతర్జాతీయ హోదా కోసం కృషిచేస్తాం. గజ్వేల్ స్ఫూర్తిగా రాష్ట్రంలో సమీకృత మార్కెట్లు ఏర్పాటు చేస్తాం.6.24 ఎకరాలలో మార్కెట్ నిర్మాణం, 6 బ్లాకులలో అన్ని రకాల కూరగాయలు, పండ్లు, మాంసాహారం లభించడంతో పాటు 16 వాణిజ్య దుకాణాలు, 1 సూపర్ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నాం. పిల్లలకు పార్క్ ఏర్పాటు మూలంగా అహ్లాదకరంగా మార్కెట్ రూపొందనుంది. గజ్వేల్ లో 22 కోట్ల రూపాయలతో నిర్మించిన సమీకృత మార్కెట్ ను, ములుగులో ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని  ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు