విశాఖలో పార్కింగ్ ఇబ్బందులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విశాఖలో పార్కింగ్ ఇబ్బందులు

విశాఖపట్టణం, డిసెంబర్ 13, (way2newstv.com)
విశాఖ నగరం విస్తీరణలో భాగంగా జనాభా పెరుగుదలతో ఎక్కడిక్కడ ట్రాఫిక్‌ సమస్యలు వస్తూనే ఉన్నాయి. దీనికి అనుగుణంగా రోడ్లు విస్తరిస్తూన్నా ఇటీవల అభివృద్ధి పనుల పేరుతో ఎక్కడి కక్కడ రహదారులు గోతులుగా తవ్వేశారు. వాటిని సరిగా పూడ్చక పోవడంతో గోతుల మయంగా మారిపోయి ఈ సమస్య నిత్యం మరింత జఠిలంగా మారిపోతూ ఉంది. అయితే దీనికి తోడు రహదారిపై ఇరువైపులా ఎక్కడిక్కడ వాహనాలు నిలుపుదల మరో కారణంగా మారుతోంది. ఇందుకు సంబంధించి అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తూనే ఉన్నాయి. గురుద్వార జంక్షన్‌ నుంచి పెట్రోల్‌ బంక్‌కు వెళ్లే మార్గంలో వాహనాల నిలుపుదలతో స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. వాహనాల మెకానిక్‌, టింకరింగ్‌ వాటర్‌ సర్వీసింగ్‌ పనుల నిమిత్తం రోడ్డుకి ఇరువైపులా వాహనాల పార్కింగ్‌తో నింపేస్తున్నారు. 
విశాఖలో పార్కింగ్ ఇబ్బందులు

ఇతర వాహనాల రాకపోకలకు వీలులే కాకుండా కార్లు, వ్యాన్లు నిలిపివేస్తున్నారు. దీంతో వాహన చోదకుల అవస్థలు పడుతున్నారు. ఇదేంటిని ప్రశ్నిస్తే మీకు ఎందుకని ఎదురుతిరుగుతున్నారు. జివిఎంసి 13వ వార్డు గురుద్వారా కూడలి నుంచి పాత పెట్రోల్‌ బంక్‌ వైపు వెళ్లే సర్వీసు రోడ్‌ పూర్తిగా ఆక్రమణలకు గురైంది. రహదారు కిరువైపులా ఆక్రమించి ఆటోలు, కార్లు రిపేర్లతో మెకానిక్‌ షెడ్లుగా మార్చేశారు. దారి పొడవునా వాహనాలు నిలిపి మరమ్మతులు చేస్తూ రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్నారు. ఇదే మార్గంలో కొంతమంది రోడ్డును ఇసుక, పిక్కా, వ్యాపారాలు చేస్తున్నారు. గురుద్వార కూడలి విజయ మెడికల్‌ సెంటర్‌ ప్రక్కన నుంచి గొల్ల వీధికి వెళ్లే మార్గంలో మెకానిక్‌ షెడ్‌ నిర్వహిస్తున్న వ్యక్తి రోడ్డుకు రెండు వైపులా వాహనాలు నిలిపివేస్తూ రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. గురుద్వారా కూడలి నుంచి గొల్ల వీధికి పెద్ద నుయ్యకి వెళ్లే రహదారిలో కూడా ఒక వైపు వాటర్‌ సర్విసింగ్‌ మరో వైపు మెకానిక్‌ షెడ్ల నిర్వహణలో ఇరు వ్యాపారులు రోడ్‌ బ్లాక్‌ చేస్తున్నారు. గణేష్‌ నగర్‌లో చిన్న వినాయకుని గుడి నుంచి గొల్ల వీధికి వెళ్లే మార్గం ఇరు వైపులా కార్ల పార్కింగ్‌తో రమదారి కుదించుకుపోయింది. కనకమ్మ గుడి వద్ద వాహనాల మెకానిక్‌ షెడ్‌లు, టింకరింగ్‌ షెడ్‌లు నిర్వహిస్తూ మరమ్మతుల కోసం వచ్చిన వాహనాల రోజుల తరబడి రోడ్డు పక్కన పార్కు చేసి ఇబ్బందులు పాలు చేస్తున్నారు. వాహనాలు ఎదురుగా మరో వాహనాలు ఎదురైనపుపడు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. 12వ వార్డు చిన్నూరు మసీదు వద్ద ఇదే పరిస్థితి రోడ్డుకి ఇరువైపులా వాహనాలు తిను బండారాలు షాపులు ఉండటంతో రోడ్డుమీదే వాహనాలు నిలుపుచేయడంతో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడుతుంది. ఇప్పటికైనా జివిఎంసి అధికారులు చొరవ చూపించి సమస్యను తొలగించాలని వాహన చోదకులు, పాదచారులు కోరుతున్నారు.