కార్లపై డిసెంబర్ ఇయర్ ఎండర్ ఆఫర్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కార్లపై డిసెంబర్ ఇయర్ ఎండర్ ఆఫర్లు

ముంబై, డిసెంబర్ 10 (way2newstv.com)
ఆటోమొబైల్‌ సంస్థలకు నిరాశనే మిగిల్చింది. ఆర్థిక మాంద్యం సెగ ఒకవైపు..మరోవైపు వినియోగదారుల్లో సెంటిమెంట్‌ నిరాశావాదంగా ఉండటంతో టాప్‌గేర్‌లో దూసుకుపోయిన వాహన విక్రయాలకు బ్రేక్‌పడినట్లు అయింది. పండుగ సీజన్‌ మినహా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయాల్లో గట్టి షాక్‌ తగిలింది. దీంతో చేసేదేమి లేక సంస్థల వద్ద పేరుకుపోయిన స్టాక్‌లను వదిలించుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశాయి సంస్థలు. దీంట్లోభాగంగా పలు సంస్థలు రాయితీలను తెరపైకి తీసుకొచ్చాయి. 2019 సంవత్సరం చివరి నెల డిసెంబర్‌లో డిస్కౌంట్లను ప్రకటిస్తు వస్తున్న సంస్థలు ఈసారి వినియోగదారులను ఆకట్టుకోవడానికి భారీగా ప్రకటించాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ అయితే ఏకంగా లక్ష రూపాయలకు పైగా రాయితీ ప్రకటించింది. బాలెనో, సియాజ్‌, ఇగ్నిస్‌, ఎస్‌-క్రాస్‌ మోడళ్లపై రూ.1.13 లక్షల వరకు ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. 
కార్లపై  డిసెంబర్ ఇయర్ ఎండర్ ఆఫర్లు

ఈ నెల చివరి వరకు మాత్రమే ఈ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. జపాన్‌కు చెందిన నిస్సాన్‌ కూడా రూ.1.15 లక్షల వరకు ఆర్థికంగా ప్రయోజనం కల్పించనున్నట్లు ప్రకటించింది.మల్టీపర్పస్‌ వాహనమైన బాలెనోపై మారుతి రూ.45 వేల వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించింది. వీటిలో వినియోగదారుల రాయితీ కింద రూ.25 వేలు ఇవ్వనున్న సంస్థ.. ఎక్సేంజ్‌ ఆఫర్‌ కింద మరో రూ.15 వేలు, కార్పొరేట్‌ ఆఫర్‌ కింద మరో రూ.5 వేలు కల్పిస్తున్నది.మారుతికి చెందిన బాలెనో డీజిల్‌ రకాన్ని కొనుగోలు చేసినవారికి రూ.67,400 ప్రయోజనాలు కల్పిస్తున్నది సంస్థ. దీంట్లో కన్జ్యూమర్‌ డిస్కౌంట్‌ కింద రూ.25 వేలు లభించనుండగా, ఎక్సేంజ్‌ ఆఫర్‌ కింద రూ.15 వేలు, కార్పొరేట్‌ ఆఫర్‌ కింద మరో రూ.10 వేలు లభించనున్నాయి. ఈ కారుపై ఐదేండ్ల వ్యారెంటీని ఉచితంగా అందిస్తున్నది.పెట్రోల్‌ ఇంజిన్‌ కలిగిన సియాజ్‌పై రూ.75 వేల వరకు ప్రయోజనాలు కల్పిస్తున్నది మారుతి. వీటిలో వినియోగదారుల డిస్కౌంట్‌ కింద రూ.25 వేలు లభించనుండగా, అలాగే ఎక్సేంజ్‌ ఆఫర్‌ కింద రూ.40 వేలు, కార్పొరేట్‌ ఆఫర్‌ కింద రూ.10 వేలు ఇస్తున్నది. అలాగే డీజిల్‌ ఇంజిన్‌తో తయారైన సియాజ్‌పై రూ.1.13 లక్షల వరకు ప్రయోజనం లభించనున్నది. దీంట్లో కన్జ్యూమర్‌ డిస్కౌంట్‌ కింద రూ.40 వేలు, ఎక్సేంజ్‌ ఆఫర్‌ కింద రూ.40 వేలు, కార్పొరేట్‌ ఆఫర్‌ కింద రూ.10 వేలు లభించనున్నాయి. ఎలాంటి చెల్లింపులు జరుపకుండా ఈ కారుపై అదనంగా ఐదేండ్ల వ్యారెంటీ సదుపాయం కూడా కల్పిస్తున్నది.ఇగ్నిస్‌ పెట్రోల్‌ వెర్షన్‌ను కొనుగోలు చేసిన వారు రూ.65 వేల ఆదా కానున్నది. దీంట్లో కస్టమర్‌ డిస్కౌంట్‌ కింద రూ.30 వేలు, ఎక్సేంజ్‌ ఆఫర్‌ కింద మరో రూ.25 వేలు, కార్పొరేట్‌ ఆఫర్‌ కింద రూ.10వేలు ఇస్తున్నది.ప్రీమియం కారైన ఎస్‌-క్రాస్‌పై మారుతి రూ.1.13 లక్షల వరకు ప్రయోజనలు కల్పిస్తున్నది. ఈ డీజిల్‌ కారుపై రూ.50 వేలు కన్జ్యూమర్‌ డిస్కౌంట్‌ లభించనుండగా, ఎక్సేంజ్‌ ఆఫర్‌ కింద రూ.30 వేలు, కార్పొరేట్‌ ఆఫర్‌ కింద రూ.10 వేలు ఆదా కానున్నది. దీంతోపాటు ఐదేండ్లపాటు వ్యారెంటీ కల్పిస్తున్నది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల్లో ఈ కారును కొనుగోలు చేసిన వారికి మరో రూ.10 వేలు రాయితీ లభించనున్నది.జపాన్‌కు చెందిన ఆటోమొబైల్‌ సంస్థ నిస్సాన్‌..‘రెడ్‌ వీకెండ్స్‌ పేరుతో కొనుగోలుదారులకు రూ.1.15 లక్షల వరకు ప్రయోజనాలు కల్పించబోతున్నది. వీటిలో నగదు రాయితీ కింద రూ.40 వేలు అందిస్తున్న సంస్థ..ఎక్సేంజ్‌ బోనస్‌ కింద రూ.40 వేలు, కార్పొరేట్‌ డిస్కౌంట్‌ కింద రూ.10 వేలు అందిస్తున్నది. తొలిసారి కారును కొనుగోలు చేసేవారిని దృష్టిలో పెట్టుకొని ప్రకటించిన ఈ ప్రత్యేక ఆఫర్‌తో ద్విచక్ర వాహనం నుంచి డాట్సన్‌ రెడీ-గోతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికినట్లు అవుతదని కంపెనీ ఎండీ రాకేశ్‌ శ్రీవాత్సవ తెలిపారు. అలాగే తొలిసారి కారును కొనుగోలు చేసిన వారికి 6.99 శాతం వడ్డీకే ఫైనాన్స్‌ సేవలు అందిస్తున్నట్లు, ఇది 36 నెలల్లో పూర్తిగా చెల్లించాల్సి ఉంటుందని చెప్పా