సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయిన గోకరాజు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయిన గోకరాజు

ఏలూరు, డిసెంబర్ 12, (way2newstv.com)
బీజేపీ సీనియ‌ర్‌నాయ‌కుడు, ఆర్‌ఎస్ఎస్‌వాది, న‌ర‌సాపురం మాజీ ఎంపీ గోక‌రాజు గంగ‌రాజు కుటుంబం అనూహ్యంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయ‌న ఒక్కడు త‌ప్ప.. కుమారుడు, సోద‌రులు.. మిగిలిన కుటుంబ స‌భ్యులు అంద‌రూ క‌లిసి మూకుమ్మడిగా ఫ్యాన్ కిందికి చేరిపోయారు. వాస్తవానికి గోక‌రాజు గంగరాజు కూడా పార్టీ మార‌తార‌నే ప్రచారం జ‌రిగినా.. కేంద్రంలోని బీజేపీతో అతి ద‌గ్గర చ‌నువు ఉండ‌డం, కీల‌క నాయ‌కుల‌తో మంచి సంబంధాలు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో వాటిని చెడ‌గొట్టుకోవ‌డం ఇష్టం లేక‌నే గోక‌రాజు గంగరాజు తన కుటుంబాన్ని వ్యూహాత్మకంగా జ‌గ‌న్ పంచ‌కు చేర్చార‌ని అంటున్నారు.
సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయిన గోకరాజు

అయితే, రాజ‌కీయాల్లో ఎవ‌రు ఏ ప‌నిచేసినా.. ఊరికేనే చేయ‌ర‌నే విష‌యాన్ని గోక‌రాజు గంగరాజు కూడా నిరూపించు కున్నార‌ని అంటున్నారు. వైసీపీలోకి చేర‌డం ద్వారా ఆయ‌న మూడు లాభాలు ఉన్నాయ‌ని, వాటి కోస‌మే ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నార‌ని చెబుతున్నారు. అదే స‌మ‌యంలో గోక‌రాజు గంగరాజును కానీ, ఆయ‌న ఫ్యామి లీని కానీ వైసీపీలో చేర్చుకోవ‌డం ద్వారా అధికార పార్టీ కూడా వ్యూహాత్మకంగా రాజ‌కీయ ల‌బ్ధి పొందే అవ‌కాశం ఎక్కువ‌గా క‌నిపిస్తోంద‌నే ప్రచారం సాగుతోంది. గోక‌రాజు గంగరాజు ప‌రంగా చూస్తే.. ఒక‌టి.. ఆయ‌న కుమారుడు రామ‌రాజుకు రాజ‌కీయంగా లైఫ్ ఇవ్వడం. ఈ క్రమంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఉండి టికెట్‌ను ఆయ‌న‌కు కేటాయించేలా వైసీపీతో ఒప్పందం చేసుకోవ‌డం. త్వర‌లోనే రామ‌రాజుకు ఉండి వైసీపీ క‌న్వీన‌ర్ ప‌గ్గాలు ఇస్తార‌ని టాక్‌..?రెండో ప్రయోజనం ఏంటంటే గోక‌రాజు గంగరాజుకు వైసీపీ కోటాలో రాజ్యస‌భ స‌భ్యత్వం తెచ్చుకోవ‌డం. ఆయ‌న మ‌ళ్లీ ఢిల్లీ రాజ‌కీయాల్లో కీల‌కం కావాల‌ని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న‌కు రాజ్యస‌భ‌పై హామీ వ‌చ్చిందంటున్నారు. మూడు .. కృష్ణాక‌ర‌క‌ట్ట వెంబ‌డి ఉన్న గోక‌రాజు గంగరాజు భారీ భ‌వంతిని న‌దీ నిబంధనల కింద ఎలాగూ వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. దీనిని కూల గొట్టేసి.. త‌ద్వారా ప్రభుత్వానికి స‌హ‌క‌రించి, అనంత‌రం సీఆర్డీఏ ప‌రిధిలో అంత‌కు నాలుగింత‌ల భూమిని సొంతం చేసుకోవ‌డం ఇలా ఒక్క జంప్‌తో మూడు ప్రధాన ప్రయోజ‌నాలు సొంతం చేసుకునేందుకు గోక‌రాజు గంగరాజు ప్లాన్ చేసుకున్నార‌ని అంటున్నారు. ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.గోక‌రాజు గంగరాజు కుటుంబాన్ని పార్టీలోకి చేర్చుకోవ‌డం ద్వారా రాష్ట్రంలో బీజేపీ నేత‌ల నుంచి ఎదుర‌వుతున్న విమ‌ర్శల‌కు చెక్ పెట్టడం.దీంతోపాటు.. క‌ర‌క‌ట్టపై మాజీ సీఎం చంద్రబాబు నివ‌సిస్తున్న లింగ‌మ‌నేని ఎస్టేట్‌ను కూల‌గొట్టేందుకు మార్గం సుగ‌మం చేసుకోవ‌డం. ఇప్పటి వ‌ర‌కు గోక‌రాజు గంగరాజు వంటివారి భ‌వ‌నాలను సాకుగా చూపుతున్న లింగ‌మ‌నేనికి గోక‌రాజు భ‌వ‌నాన్ని కూల్చేసి.. చెక్ పెట్టి.. చంద్రబాబును అక్కడి నుంచి సాగ‌నంపాల‌నేది జ‌గ‌న్ వ్యూహం. ఈ విష‌యంలో స‌క్సెస్ అయితే, బాబుపై జగన్ పైచేయి సాధించిన‌ట్టే అవుతుంద‌నేది వైసీపీ ఆలోచ‌న. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి