మున్సిపల్‌ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్‌విజయం: తలసాని - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మున్సిపల్‌ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్‌విజయం: తలసాని

మేడ్చల్‌ డిసెంబర్ 28(way2newstv.com):
నాగారం మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ పార్టీ సర్వసభ్య సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. 'తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథాకాలతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు. 

మున్సిపల్‌ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్‌విజయం: తలసాని

చరిత్రలో ఎన్నడూ లేనంతగా మున్సిపాలిటీలకు నిధులిచ్చాం. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు 24 గంటల కరెంట్‌ గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. మేడ్చల్‌ నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు మున్సిపల్‌ కార్పొరేషన్లు మన నగరం కార్యక్రమంతో అద్దంలా తయారయ్యాయి. టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం. మున్సిపల్‌ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధించి సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌లకు కానుకగా ఇద్దామని' మంత్రి పిలుపునిచ్చారు.