విజయనగరం, డిసెంబర్ 13, (way2newstv.com)
వేసవిలో తాగునీటి కష్టాలు ఉండటం సహజం. అయితే ప్రస్తుత వర్షాకాలంలో కూడా నిన్న, మొన్నటి వరకు రోజు విడచి రోజు తాగునీరు సరఫరా అవుతున్నది. అనంతరం వర్షాలు విస్తారంగా కురవడంతో గొస్తనీ నదికి పుష్కలంగా నీరు చేరింది. భూగర్భజలాలు కూడా వృద్ధి చెందాయి. ఈ క్రమంలో ప్రతిరోజూ తాగునీరు సరఫరా జరుగుతుంది. అయితే తగరపువలసలోని పలు వార్డుల్లో సరిపడా తాగునీరు సరఫరా కావడం లేదని మహిళలు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. తాజాగా స్థానిక 8వ వార్డు పరిధి శ్రీనగర్‌లో క్రమం తప్పకుండా తాగునీరు సరఫరా చేస్తున్నప్పటికీ సరఫరా సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుందని అక్కడున్న మహిళలు అంటున్నారు.
నీటి కొరత షురూ అయింది
ఉదయం 8.30 నుంచి సుమారు గంట సమయం నీరు సరఫరా అవుతుందని, ఈ సమయంలో ఒక కుటుంబానికి ఒక్కోసారి 4, ఒక్కోసారి 5 బిందెలు నీరు అందుతుందని మహిళలు వివరించారు. తమ వీధిలో చేతి పంపులు కూడా లేనందున తాగేందుకు, వాడుకకు తాగునీటినే వాడుకోవాల్సి వస్తుందని, దీంతో తమ నీటి అవసరాలు తీరడం కష్టంగా ఉందని వాపోయారు. జివిఎంసి అధికారులు స్పందించి సరిపడా తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు.మా అవసరాలకు సరిపడా తాగునీరు సరఫరా చేయాలి. రోజుకు గంట సమయం నీరు ఇస్తున్నప్పటికీ వచ్చే ధార చిన్నది కావడంతో నాలుగైదు, బిందెలకు మించి నీరురావడంలేదు. ఆ నాలుగైదు బిందెలు ఎటూ చాలక ఇబ్బంది పడుతున్నామంటున్నారు స్థానికులువర్షాకాలంలో కూడా తాగునీటి సమస్య ఉంది. అధికారులు కొంత కాలంగా రోజూ తాగునీరు అందిస్తున్నా నీరు తక్కువ మోతాదులో రావడంతో వచ్చే నీరు చాలడంలేదు. ఎక్కువ నీరు పైపులనుంచి వచ్చేలా జివిఎంసి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.