ప్రజా సమస్యలను పరిష్కారించాలి

వరంగల్ అర్బన్, డిసెంబర్ 23, (way2newstv.com):
ప్రజావాణిలో స్వీకరించిన విజ్ఙాపన పనులను ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలని  జిల్లా కలెక్టర్  ప్రశాంత్ జె.పాటిల్ అధికారులను  అదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ పాల్గొని, జిల్లా  నలుమూలల నుంచి  వివిధ సమస్యలతో  వచ్చిన ప్రజలు వద్ద నుండి దరఖాస్తూలను స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు  ఎండార్స్ మెంట్ చేసి ఇచ్చి, జాప్యం లేకుండా క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. 
ప్రజా సమస్యలను పరిష్కారించాలి

భూ సమస్యలు, కార్పొరేషన్లకు చెందిన రుణాలు. ఉపాధి కల్పన, మౌలిక వసతుల కల్పన, తదితర అంశాలపై కలెక్టర్ కు ప్రజలు వినతులను అందించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ కలెక్టర్ ఎం.మను చౌదరి, డిఆర్ ఓ పి.మోహన్ లాల్, ఆర్టీఓ కె.వెంకారెడ్డి, మెప్మాపిడి కృష్ణవేణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Previous Post Next Post