కౌతాళం డిసెంబర్ 2 (way2newstv.com)
ప్రియాంక రెడ్డి, మనస లను హతమార్చిన మానవ మృగలను బహిరంగ ఉరి తీయాలని మండల కేంద్రంలో హైస్కూల నుండి వైస్సార్ సర్కిల్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఆదివారం రాత్రి కస్తూర్బా పాఠశాల లో బాలికలు కొవ్వుతులతో వారి ఆత్మకు శాంతి కలగాలని నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ ఐ ఎస్ ఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర మండల అధ్యక్షుడు కుమార్,తాలుకు కార్యదర్శి ఆదామ్ డిమాండ్ చేసారు.
మానవ మృగలను బహిరంగంగా ఉరి తీయాలి
మానస,ప్రియాంక రెడ్డి లను హత్యాచారం చేసి,హతమార్చిన కామాంధులను బహిరంగంగా ఉరితీయాలని కోరుతూ, వారి ఆత్మకు శాంతి కలగాలని సోమవారం ఏ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక కౌతాలం హైస్కూల నుండి వైస్సార్ సర్కిల్ వరకు విద్యార్థినిలు కలిసి కొవ్వుతుల ప్రదర్శన నిర్వహించరు. ఉపేంద్ర,కుమార్,నాగేంద్ర, పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు మహిళ పట్ల జరుగుతున్న హత్యాచారాల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోరువిప్పకపోవడం చాలా బాధాకరమని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కామాంధులపై కఠిన చర్యలు తీసుకోవాలని,వారిని బహిరంగంగా ఉరితీసి మరొక్కసారి మన అడబిడ్డలపై ఎటువంటి అత్యాచారాలు జరగకుండా చట్టాలను పగడ్బందీగా అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థిని లు మండలం నాయకులు పాల్గొన్నారు.