ఆరోగ్యం వుంటేనే అదృష్టం

వరంగల్ డిసెంబర్ 19  (way2newstv.com)
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ  గురువారం వంగపహాడ్ గ్రామంలోని కమ్యూనిటీ హాల్ లో పేదలకు ఉచిత వైద్య శిబిరమును నిర్వహించడం తో పాటు నల్సా పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.  ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ  కార్యదర్శి,  సీనియర్ సివిల్ జడ్జి  జి.వి. మహేష్ నాథ్ మాట్లాడుతూ "ఆరోగ్యంగా ఉంటేనే అదృష్టవంతులు" అని పేర్కొన్నారు. అనారోగ్యాల పాలయిన వారు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ, ఔషధాలు వాడుతూ, శారీరకంగా, మానసికంగా బలహీన పడతారు. కావున ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే సంతోషంగా ఉండడానికి వీలు అవుతుంది అని అన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకొని, ప్రజలు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు చేయించుకుని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. 
ఆరోగ్యం వుంటేనే అదృష్టం

ఈ సందర్భంగా మహిళలు చట్ట వ్యతిరేక పనులను నిర్వర్తించరాదని, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి స్వయం ఉపాధులలో శిక్షణ పొంది, ప్రావీణ్యాలను ఏర్పరచుకొని, సంఘంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవలెను కానీ, అసాంఘిక కార్యకలాపాలను ఎంచుకొని, తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకోరాదని తెలియజేశారు. ప్రజలందరూ చట్టాల గురించి అవగాహన ను ఏర్పరచుకొని, చట్ట ఉల్లంఘన పనులను చేయకుండా, చట్టాలకు లోబడి ఉండాలని తెలియజేశారు. న్యాయ సేవాధికార సంస్థలను  ఆశ్రయించి, న్యాయ సలహాలు, సూచనలు, సేవలు పొంది, న్యాయపరమైన విషయాల పట్ల జ్ఞానాన్ని సంపాదించుకోవాలని, ఇతరుల సమస్యలను న్యాయపరంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలియజేశారు.ఈ వైద్య శిబిరము లో వరంగల్ అర్బన్ జిల్లా  వైద్య శాఖాధికారి  హరీష్ రావు,  అడిషనల్ డి.ఎం. & హెచ్.ఓ.  మదన్ మోహన్ రావు, అడిషనల్ కమిషనర్ జి.డబ్ల్యూ.ఎం.సి.  సి.హెచ్. నాగేశ్వర్, జి.డబ్ల్యూ.ఎం.సి. ఎమ్.హెచ్.ఓ. డాక్టర్ బి. రాజా రెడ్డి,  కాళోజి యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ప్రవీణ్ కుమార్,  డాక్టర్ నరేష్ , ఏ.ఎన్.ఎం. లు, ఆశా వర్కర్లు, రాణి రుద్రమదేవి మహిళా మండలి నుండి సరోజన, రాధిక, శిరీష  మరియు సుమారు 350 మంది గ్రామస్తులు వైద్య శిబిరంలో లో పాల్గొన్నారు.
Previous Post Next Post