డేంజర్ జోన్ లో ఎకానమి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

డేంజర్ జోన్ లో ఎకానమి

న్యూఢిల్లీ, డిసెంబర్ 29 (way2newstv.com)
ఎకానమీ బాగానే ఉందని మోడీ ప్రభుత్వం తరచూ చెబుతున్నప్పటికీ, పరిస్థితి చేజారిపోతోందని, తక్షణ చర్యలు అవసరమని ఇంటర్నేషనల్‌‌ మానిటరీ ఫండ్‌‌ (ఐఎంఎఫ్‌‌) హెచ్చరించింది. ఎకానమీ స్లోడౌన్‌‌ ప్రభావం చాలా ఎక్కువ ఉందని, ప్రభుత్వం వెంటనే పాలసీ యాక్షన్స్‌‌ తీసుకోవాలని స్పష్టం చేసింది. లేకపోతే మరిన్ని ఇబ్బందులు వస్తాయని కుండబద్దలు కొట్టింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవలి సంవత్సరాల్లో ఎకానమీ అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాల వల్ల లక్షల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ఐఎంఎఫ్‌‌ సోమవారం విడుదల చేసిన రిపోర్టు ప్రశంసించింది. కొన్ని పరిస్థితుల వల్ల ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఎకానమీ నెమ్మదించిందని వెల్లడించింది. ‘‘ఆర్థికవృద్ధి నెమ్మదించడం.. ఇండియా ప్రస్తుతం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య .
డేంజర్ జోన్ లో ఎకానమి

ఇది సాధారణ స్లోడౌనేనని (సైక్లికల్‌‌), ప్రభుత్వపరమైన లోపాలు ఏమీ లేవని అనుకుంటున్నాం. ఆర్థికరంగంలోని కొన్ని ఇబ్బందుల వల్ల ఇలా జరుగుతోంది. రికవరీ.. ఇది వరకు అనుకున్నంత ఈజీ కాదు’’ అని ఐఎంఎఫ్‌‌ మిషన్‌‌ చీఫ్‌‌ ఫర్‌‌ ఇండియా రణిల్‌‌ సాల్గడో వివరించారు.స్లోడౌన్‌‌ నుంచి బయటపడటానికి స్థూల ఆర్థిక వ్యవస్థను సమర్థంగా నిర్వహించాలని ఐఎంఎఫ్‌‌ సూచించింది. వృద్ధిరేటు పెరగడానికి సంస్కరణలను వేగవంతం చేయాలని రికమెండ్‌‌ చేసింది. ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన క్వార్టర్‌‌లో జీడీపీ వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్టం 4.5 శాతానికి పడిపోయిన నేపథ్యంలో ఐఎంఎఫ్‌‌ ఈ రిపోర్టును విడుదల చేసింది. దీంతో దేశంలోని ప్రైవేట్‌‌ రంగపు డిమాండ్‌‌ ఒక్క శాతం మాత్రమే పెరిగిందని పేర్కొంది. తాజా రిపోర్టును ఈ ఏడాది ఆగస్టులో తయారు చేసినట్టు ఐఎంఎఫ్‌‌ తెలిపింది.  డిసెంబరులోనూ పరిస్థితులు పెద్దగా మారలేదని ఇతర ఎకనమిస్టులు కూడా చెబుతున్నారు. నాన్‌‌–బ్యాంకింగ్‌‌ దిగ్గజాలు కొన్ని సంక్షోభంలో పడటం, ఆ తర్వాత ఇతర ఎన్‌‌బీఎఫ్‌‌సీలకు లిక్విడిటీ బాగా తగ్గడమూ స్లోడౌన్‌‌ గల కారణాల్లో ముఖ్యమైనదని సాల్గడో అన్నారు. పల్లెటూళ్ల ప్రజల ఖర్చు సామర్థ్యం తగ్గడం మార్కెట్‌‌కు ఇబ్బందిగా మారిందని తెలిపారు. వ్యాపారంపై నమ్మకం తగ్గడం, బ్యాంకుల వంటి ఆర్థిక సంస్థలకు ఇబ్బందులు పెరగడం వల్ల ప్రైవేటు ఇన్వెస్ట్‌‌మెంట్లు పడిపోయాయని ఐఎంఎఫ్‌‌ రిపోర్టు వివరించింది. జీఎస్టీ వంటి కొత్త విధానాల వల్ల ఆశించిన ఫలితాలు రాకపోవడం వల్లా ఎకానమీ పుంజుకోలేకపోయిందని విమర్శించింది.ఈ పరిస్థితుల్లో ఇండియా వృద్ధి అంచనాలను జనవరిలో విడుదల చేస్తామని, గతంలో పేర్కొన్న వాటి కంటే ఇవి చాలా తక్కువగా ఉంటాయని సాల్గడో స్పష్టం చేశారు. ‘‘అయితే ఇప్పటికీ కొన్ని అంశాల్లో ఇండియా పరిస్థితి బాగుంది. రిజర్వులు రికా ర్డు స్థాయిలకు పెరిగాయి. కరెంటు ఖాతా లోటు తగ్గింది. కూరగాయల ధరల పెరుగుదల వల్ల గత నెల ద్రవ్యోల్బణం ఎక్కువైనా, గత కొన్నేళ్లుగా ఇది అదుపులోనే ఉంది. ఆర్థిక వృద్ధి సాధించడమే ఇప్పుడున్న పెద్ద సవాలు’’ అని ఆయన వివరించారు. అయితే ఇండియా ఎకానమీ స్లోడౌన్‌‌ను ఆర్థికమాంద్యంగా పిలవలేమని, ఎకానమీ బాగా నెమ్మదించిందని మాత్రమే అనగలమని స్పష్టం చేశారు. తాము ఊహించిన దానికంటే ఇది ఎక్కువ కాలం కొనసాగవచ్చని ఆయన విశదీకరించారు. ‘‘ఆర్థిక సంస్కరణలను వేగంగా అమలు చేయడానికి ఇండియా శ్రద్ధ చూపాలి. బ్యాంకులు, కార్పొరేట్‌‌ సెక్టార్‌‌ సమస్యలను పరిష్కరించాలి. ఇందుకోసం వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి. దివాలా కేసులు మరింత త్వరగా పరిష్కారం కావాలి. భూమి, కార్మిక  చట్టాల్లో మరిన్ని మార్పులు అవసరం. పోటీతత్వాన్ని మరింత పెంచాలి. విద్య, వైద్య రంగాలూ మరింత అభివృద్ధి కావాలి. ప్రభుత్వానికి అప్పులు బాగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరిన్ని సహాయ ప్యాకేజీలు ఇచ్చే శక్తి తక్కువగా ఉంటుంది’’ అని ఆయన వివరించారు.